Begin typing your search above and press return to search.
నరేంద్ర మోడీ నా ఐడియా కాపీ కొట్టారు
By: Tupaki Desk | 27 Jun 2016 7:21 AM GMTఇటీవల కాలంలో పుస్తకాలు కాపీ కొట్టారని.. సినిమా కథలు కాపీ కొట్టారని వివాదాలు రేగుతున్నాయి. సినిమా కథల విషయంలో అయితే కోర్టుల వరకు వెళ్తున్నారు. తాజాగా కాపీ వివాదమొకటి ఏకంగా ప్రధాని మోడీనే చుట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన బేటీ బచావో.. బేటీ పడావో పథకం తన ఆలోచనేనంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. పైగా ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. బాలికలను కాపాడుకోవడంతోపాటు వారికి విద్యనందించే ఉద్దేశంతో గతేడాది ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ఆ పథకం ఐడియా తనదేనని, కేంద్రం దానిని కాపీ కొట్టేసిందని రాజస్థాన్ కు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వం ఈ స్లోగన్ ను ఎక్కడి నుంచి తీసుకుందో చెప్పాలంటూ ఉదయ్ పూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో చేతనా భాటి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె ప్రధాని మోదీకి తన ప్రతిభను గుర్తించాలని కోరుతూ లేఖ రాశారు.
ఉన్నత విద్యావంతురాలైన చేతన చరిత్ర - ఇంగ్లిష్ లో పీజీ చదువుకున్నారు. 20 ఏళ్ల క్రితం పోలీస్ అధికారిగా చేరారు.. అంతకుముందు ఆమె ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గానూ పనిచేశారు. మంచి ఆలోచనాశీలిగా పేరున్న ఆమె కవిత్వం కూడా రాస్తారు. 1999లో ఆమె రాసిన ఓ కవితలో బాలికా విద్య - రక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తూ ‘‘బేటీ బచావో.. బేటీ పడావో’’ అన్న ఈ పదబంధాన్ని మొట్టమొదటగా ఆమె రాశారు. 2005లో దీనిని రూపకంగా మార్చి ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వివరాలన్నీ ప్రస్తావిస్తూ ఆమె మోడీకి లేఖ రాశారు.
అయితే.. ఆమె తన లేఖలో ఎక్కడా మోడీపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు. కానీ... బాలికల కోసం పథకం ప్లాను చేయాలని, దానికి మంచి పేరు పెట్టాలని మోడీ కోరితే అధికారులో, ఇంకెవరైనా కానీ ఆమె కవితను కాపీ కొట్టి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. డబ్బుల కోసమో, పేరు కోసమో తాను ఈ వివాదాన్ని రేపడం లేదని.. ప్రజల నోళ్లలో నానుతున్న ఈ స్లోగన్ ఐడియా నాదే అని చెబితే చాలని చేతన అంటున్నారు. మోడీ ఈ విషయంలో స్పందిస్తారని.. తనకు క్రెడిట్ ఇస్తారని ఆమె నమ్మకం కనబరుస్తున్నారు.