Begin typing your search above and press return to search.
రాగి వస్తువులు వాడితే వైరస్ దరిచేరదట !
By: Tupaki Desk | 1 Jun 2020 6:45 AM GMTదేశంలో వైరస్ రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వైరస్ వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ అనేకమంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు. మహమ్మారికి సరైన వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవిస్తూనే...వైరస్ మన దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమైన మార్గమని నిపుణులు అంటున్నారు.
తాజాగా బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విలియం కీవిల్ ఈ వైరస్ గురించి మరో విషయాన్ని వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సీనియర్ మైక్రోబయోలజిస్ట్ అయిన ప్రొఫెసర్ విలియం దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ లోహాల యాంటీ బాక్టీరియల్ గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన పరిశోధనలు మరింత ముమ్మరం చేసిన ఆయన.. రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువులపై వైరస్ చేరినట్లయితే కేవలం నాలుగు గంటల్లోనే అది అంతమవుతుందని తెలిపారు.
కాపర్ పై వైరస్ చేరినపుడు దానిలోని అయాన్లు, ఎలక్ట్రాన్లు వైరస్ మెంబ్రేన్ పై దాడి చేసి.. డీఎన్ ఏ ను నిర్వీర్యపరిచి.. దానిని పూర్తిగా నాశనం చేస్తుందని వెల్లడించారు. అలాగే , స్టీలు పై వైరస్ మూడు రోజుల పాటు బతికి ఉంటుంది. అదే రాగిపై కేవలం నాలుగు గంటలు మాత్రమే జీవించి ఉండగలదు అని తెలిపారు. ఈ వైరస్ కష్టకాలంలో మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం తప్పనిసరి చేసిన ప్రపంచ దేశాలు.. అధిక జనసంచారం ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు సహా ఇంట్లోనూ రాగి పూత ఉన్న వస్తువులను వాడేలా ప్రజలను ప్రోత్సహించాలంటున్నారు ప్రొఫెసర్ విలియం కీవిల్
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకేలో జనసమ్మర్ధం ఉన్నచోట రాగి పూత వేసిన వస్తువులు ఎక్కువగా వాడాల్సి ఉందని విలియం సూచించారు. పోలాండ్ లో బస్సుల్లో రాగితో తయారు చేసిన హ్యాండ్ రెయిల్స్ వాడుతున్నారని, చిలీ ఎయిర్ పోర్టుల్లో, బ్రెజిల్ ఇమ్మిగ్రేషన్ కియోస్కుల్లో రాగి వాడకం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. యూకేలోనూ ప్రభుత్వ భవనాలు, రైల్వే, బస్సు స్టేషన్లలో రాగి హ్యాండ్ రెయిల్స్, తలుపు బెడాలను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం సైతం.. ఇంటెన్సివ్ కేర్‌లో రాగి పూత ఉన్న పరికరాలను వాడినపుడు.. మిగతా లోహాలతో పోలిస్తే బాక్టీరియాను చంపగల శక్తి 95 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాగి పాత్రలలో నీరు తాగడం వంటిని చేస్తే చాలామంచిది. ఇప్పటికే చాలామంది రాగిపాత్రలో నీరు తాగుతుంటారు.