Begin typing your search above and press return to search.
వరుసగా రెండోరోజు టీవీ9లో సోదాలు
By: Tupaki Desk | 10 May 2019 8:03 AM GMTటీవీ9 కొత్త యాజమాన్యానికి - టీవీ9 సీఈవోకు మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం కూడా కొనసాగింది. వరుసగా రెండో రోజు కూడా బంజారాహిల్స్ లోని టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోదాలు నిర్వహించారు.
అయితే టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై సీఈవో రవిప్రకాష్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని.. తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే టీవీ9 ను కొనుగోలు చేసిన సంస్థ చేసిన ఫోర్జరీ ఆరోపణలపై రవిప్రకాష్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
టీవీ9 సీఈవో గా రవిప్రకాష్ ను తొలగించడం.. ఆయన గురువారం సాయంత్రం టీవీ9 తెరపై కనిపించి అందంతా అబద్ధమని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో టీవీ9 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశమైనట్టు తెలిసింది. తాజాగా పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు రవిప్రకాష్ తొలగింపు - కొత్త సీఈవో నియామకంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర్చించినట్టు సమాచారం.
*వివాదం ఇదీ..
టీవీ9లో 90శాతం వాటాను కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు టీవీ9 వాటాల వ్యవహారంలో సీఈవో రవిప్రకాష్ - సినీ నటుడు శివాజీల అక్రమాలపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ ఐటీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా రెండోరోజు శుక్రవారం కూడా పోలీసులు టీవీ9 కార్యాలయంలో విచారణ చేపట్టారు.