Begin typing your search above and press return to search.

ఫైన్ వేసినందుకు పోలీస్ స్టేషన్ కే షాకిచ్చాడు

By:  Tupaki Desk   |   26 Aug 2022 4:30 AM GMT
ఫైన్ వేసినందుకు పోలీస్ స్టేషన్ కే షాకిచ్చాడు
X
పోలీసులపై పగ తీర్చుకున్న ఒక లైన్ మేన్ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసులు ఏం చేస్తారన్న విషయాన్ని పట్టించుకోకుండా.. కోపంతో అతగాడి నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాన్ని నడిపిన ఉదంతంలో విద్యుత్ శాఖలోని లైన్ మెన్ కు పోలీసులు భారీగా ఫైన్ వేశారు. తాజాగా అతగాడికి హెల్మెట్ లేదని రూ.6వేలు ఫైన్ వేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు లైన్ మేన్.. ఆన్ లైన్ లో సదరు పోలీస్ స్టేషన్ ఉన్న బకాయిల్ని టెస్టు చేశారు.

ఆన్ లైన్ లో పోలీస్ స్టేషన్ విద్యుత్ బకాయిల్ని చెల్లించలేదన్న విషయాన్ని గుర్తించిన సదరు లైన్ మేన్.. ఆ సమాచారాన్ని తన ఉన్నతాధికారులకు అందజేశారు.దీంతో.. పోలీస్ స్టేషన్ విద్యుత్ కనెక్షన్ ను తొలగించాల్సిందిగా సదరు లైన్ మేన్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతే.. ఆలస్యం చేయని సదరు లైన్ మ్యాన్.. స్టేషన్ కు సమీపంలోని పోల్ ఎక్కేసి.. పోలీస్ స్టేషన్ కనెక్షన్ కట్ చేశాడు.

అప్పటివరకు వెలుగులు చిమ్ముతున్న సదరు పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. విషయం వారికి అర్థమయ్యేసరికి.. ఈ లైన్ మ్యాన్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూపీ లోని షామ్లీకి చెందిన లైన్ మ్యాన్ కు హెల్మెట్ లేకుండా వాహనం మీద వెళుతున్నందుకు భారీ ఫైన్ వేయటం.. కోపంతో పోలీస్ స్టేషన్ కు కరెంటు కనెక్షన్ ను తీసేసిన వైనం షాకింగ్ గా మారింది. లైన్ మేన్ కోపం దెబ్బకు సదరు పోలీస్ స్టేషన్ లో దాదాపు రాత్రంతా చీకట్లోనే గడిపిన వైనం షాకింగ్ గా మారింది.

ఇతగాడు పోల్ ఎక్కిన వైనాన్ని వీడియో షూట్ చేయటం.. అది కాస్తా ఇప్పుడుచాలా పాపులర్ గా మారిందని చెబుతున్నారు.