Begin typing your search above and press return to search.

పోలీసు దుస్తుల‌తో నిందితుడికి భ‌ధ్ర‌త‌

By:  Tupaki Desk   |   6 Dec 2016 5:57 AM GMT
పోలీసు దుస్తుల‌తో నిందితుడికి భ‌ధ్ర‌త‌
X
తన దగ్గర 13, 860 కోట్ల నల్లధనం ఉందని ప్ర‌క‌టించి అనంత‌రం చేతులు ఎత్తేసిన గుజరాత్‌ కు చెందిన రియల్టర్ మహేశ్‌ షాకు పోలీసులు భద్రతను పెంచారు. పెద్ద ఎత్తున ఆదాయం చూపిన‌ప్ప‌టికీ వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆదాయపన్నుశాఖ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అతడిని పోలీసులు దుస్తులు వేసి ఎస్కార్ట్ వాహనంలో తీసుకువెళ్తున్నామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఏకేసింగ్ తెలిపారు. మహేశ్ కూతురు ఇంటి నుంచి తీసుకువెళ్లేడప్పుడు కూడా పోలీసు దుస్తులు వేశామన్నారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారులను సంప్రదించకుండానే చేశామని అన్నారు. వ్యాపారులు - రాజకీయ నేతల నుంచి ముప్పు పొంచి ఉందనే మహేశ్‌ కు భద్రతను పెంచామని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా పెద్ద నోట్ల రద్దుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన కారణాల్లో కీల‌క‌మైన విష‌యంలో వైఫ‌ల్యం క‌నిపిస్తోంది. దాయాది పాకిస్థాన్.. దేశంలోకి ఏటా 70కోట్లకు పైచిలుకు దొంగనోట్లు చెలామణిలోకి తెస్తున్నదని, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదని మోడీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నోట్లరద్దుతో దొంగనోట్లు పెద్ద ఎత్తున బయటపడుతాయని చాలామంది ఊహించారు. కానీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నోట్లలో 3.4శాతం మాత్రమే దొంగనోట్లుగా తేలింది. నవంబర్ 27వ తేదీవరకు దేశంలోని అన్ని బ్యాంకుల్లో జమ అయిన రూ.500 - రూ.1000నోట్లలో 1.39లక్షల నోట్లు మాత్రమే నకిలీవి అని - వాటి విలువ రూ.9.63 కోట్లు మాత్రమేనని అధికార లెక్కలు చెప్తున్నాయి.

ఏటా కోట్లకొద్దీ దొంగడబ్బు చెలామణిలోకి వచ్చిందని ప్రభుత్వం చెప్తున్నా.. బ్యాంకులకు చేరిన దొంగనోట్లు మాత్రం అతి స్వల్పమేనని బ్యాంకు వర్గాలు చెప్తుండ‌టం ఆస‌క్తిక‌రం. 2016 ద్వితీయార్థంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌ స్టిట్యూట్ (ఐఎస్‌ ఐ) వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో చెలామణిలో ఉన్న రూ.500 - రూ.1000 దొంగనోట్ల విలువ రూ.300కోట్లు. అవి సామాన్యుల చేతుల్లోకి వెళ్లిపోయాయని కూడా సంస్థ వెల్లడించింది. రూ.9.63 కోట్ల విలువైన దొంగనోట్లు బ్యాంకులకు తెచ్చిన వారికి కూడా అవి నకిలీ నోట్లు అన్న సంగతి తెలియకపోవడం గమనార్హం. పెద్దనోట్లు బ్యాంకుల్లో తీసుకోవడానికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉండటంతో.. దొంగనోట్లు మరింత బయటపడే అవకాశం లేకపోలేదని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/