Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ పై కేసు.. షాకిచ్చిన పోలీసులు
By: Tupaki Desk | 1 Jan 2020 9:55 AM GMTరాజధాని రైతులను కలిసే క్రమంలో పోలీసుల పై ఓవరాక్షన్ చేసిన జనసేనాని పవన్ కళ్యాన్ గట్టి షాకిచ్చారు పోలీసులు.. రాజధాని పర్యటనలో భాగంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి ఎదురు తిరిగినందుకు సెక్షన్ 144, 30 యాక్ట్ కింద పవన్ కళ్యాణ్ పై తూళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం గా మారింది.
పవన్ అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ అమరావతి రైతులను కలవడానికి వెళుతుండగా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. ఆయనను అక్కడికి వెళ్లనీయకుండా శతవిధాలా అడ్డుకున్నారు. 200 మంది పోలీసులు మందడంలో మోహరించి పవన్ ను పోనీయకుండా ఇనుప కంచెలు, ప్రొక్లెయినర్ల ను అడ్డుగా పెట్టారు.
అయితే రైతులు, జనసేన కార్యకర్తలు పవన్ కు రక్షణగా నిలబడి చాకచక్యంగా ఆయనను అక్కడి నుంచి రైతుల వద్దకు వెళ్లనిచ్చారు. పోలీసులు తేరుకొని జనసేనాని పవన్ ను మరోసారి అడ్డుకున్నారు. సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష చేస్తున్నారని.. పాదయాత్ర, ఆందోళనలు మంచిది కాదని.. సహకరించాలని కోరినా పవన్ వినలేదు. అడ్డుకోవడంతో సీరియస్ అయిన పవన్.. ‘కాల్చితే కాల్చుకోండి ’ అంటూ పోలీసుల తుపాకులకు ఎదురెళ్లి వారిపై మండిపడ్డారు. తాను కూడా పోలీసు కొడుకునే అని ఒకొనొక దశ లో పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి నడుచుకుంటూ వెళ్లి పోయారు.రైతులు మహిళలు పోలీసులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు.
ఈ క్రమం లోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.