Begin typing your search above and press return to search.
ఛీర్ గాళ్స్ గదుల్లో పోలీసులు!
By: Tupaki Desk | 13 May 2015 9:40 AM GMTతాజాగా ట్విట్టర్ వేదికగా లలిత్ మోడీ... చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ గా చేసిన ఆరోపణలు మినహా ఈ సీజన్ ఐపీఎల్ అంతా సజావుగానే సాగుతుంది! అయితే ఐపీఎల్ - 8 లో బెట్టింగులు జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా ఏమీ లేకపోయినా... గుట్టుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి! తాజాగా ఐపీఎల్ - 8 ఛీర్ గాళ్స్ కు - పోలీసులకు సంబందించిన ఒక వివాదం జరిగింది! అత్యుత్సాహం ప్రదర్శించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయ్ పూర్ పోలీసులు ఉన్నట్లుండి ఛీర్ గాళ్స్ ఉంటున్న హోటల్స్ పై దాడులు చేశారు! బుకీలు ఉన్నారు, బెట్టింగులు జరుగుతున్నాయి అనే కారణాలను చూపిస్తూ... అర్ధరాత్రి సమయంలో ఛీర్స్ గాళ్స్ బస చేసిన హోటల్ పై దాడి చేసి సోదాలు నిర్వహించారు.
మంగళవారం రాత్రి ఢిల్లీ- చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే నగరంలోని రాయ్ పూర్ లోని జీఈ రోడ్డు ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ బస చేసిన హోటల్ పై పోలీసులు దాడి చేసి, సోదాలు నిర్వహించి సుమారు గంటపాటు ఛీర్ లీడర్స్ పై రకరకాల ప్రశ్నలు సంధించారట! ప్రస్తుతం జరుగుతున్న బెట్టింగులకు ఛీర్ లీడర్స్ కేంద్రంగా ఉంటున్నారనేది పోలీసుల ఆరోపణ గా ఉంది!! అయితే... రొటీన్ చెకప్స్ లో భాగంగానే ఛీర్ లీడర్స్ గదుల్ని తనిఖీ చేశామని, ఇందులో మరో ఉద్దేశానికి తావు లేదని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు!
పోలీసుల ఆరోపణ అలా ఉంటే... ఛీర్ లీడర్స్ వెర్షన్ మరోలా ఉంది! సోదాల పేరుతో పోలీసులు తమను వేధించారని, తనకు వర్క్ పర్మిట్ ఉందని తెలిసి కూడా ఈ స్థాయిలో ఇబ్బందిపెట్టడం మంచి పని కాదని అంటున్నారు! గతంలో చాలా బాలీవుడ్ సినిమాలకు కూడా పని చేశామని అయితే ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని, పోలీసులు తమను బాగా ఇబ్బందిపెట్టారని చెబుతున్నారు! ఇదే సమయంలో తమపై ఏవైనా ఫిర్యాదులు వస్తే నిర్వాహకులను సంప్రదించాలి కానీ నేరుగా హోటల్ గదుల్లోకి దూరి భీభత్సం చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు!!
కాగా ఛీర్ లీడర్స్ ద్వారా ఆటగాళ్లకు ఎరవేసి ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారు అనే ఉదంతాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఛీర్ లీడర్స్ కు, ఆటగాళ్లకు వేర్వేరు హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు ఐపీఎల్ నిర్వాహకులు.