Begin typing your search above and press return to search.

ఆ ముప్ఫై సెకన్లు వారికెంత డేంజరో తెలిస్తే షాకే!

By:  Tupaki Desk   |   30 April 2020 2:30 AM GMT
ఆ ముప్ఫై సెకన్లు వారికెంత డేంజరో తెలిస్తే షాకే!
X
కరోనా వైరస్ ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిన వారికి కిలో మీటర్ దూరంలో ఉన్నోళ్ల గుండెలు అదిరిపోతున్నప్పుడు.. వారికి అత్యంత సమీపంలోకి వెళ్లటమే కాదు.. వారి నుంచి వైరస్ నిర్దారిత పరీక్షల కోసం వారి నుంచి శాంపిల్ కలెక్టు చేయటానికి మించిన రిస్కు మరొకటి ఉండదేమో. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించటం ఒక రిస్కు అయితే.. పాజిటివ్ పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరణ మాటలు చెప్పినంత ఈజీ కాదని చెప్పాలి.

ల్యాండ్ డైనమెట్ మీద కాలు పెట్టి.. పని చేయాలంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి పరిస్థితే శాంపిల్స్ సేకరించే వారి పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేసే పుష్కర దహివాల్ తన అనుభవాన్ని వెల్లడించారు. కరోనా అనుమానితులు.. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించటం అన్నింటికంటే రిస్క్ తో కూడుకున్న పనిగా చెబుతున్నారు.

పీపీఈ కిట్ల ముసుగులో చెమటలు కక్కుతూ.. రోజుకు 80 నుంచి 100 మంది నుంచి శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. అన్నింటి కంటే కష్టమైన పని.. పది నుంచి పన్నెండు సెంటీమాటర్ల పొడవు ఉండే చిన్నపాటి పరికరంతో నోట్లోని స్రావాల్ని సేకరిస్తారు. ఈ సమయంలో సదరు పేషెంట్ దగ్గటం కానీ తుమ్మటం కానీ చేయకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా లాంటి ప్రమాదకరవైరస్ నుంచి ముప్పు పొంచి ఉంటుంది.

శాంపిల్స్ సేకరించటం ఒత్తిడితో కూడుకున్నదేనని చెబుతున్నారు. నిత్యం శాంపిల్స్ తీసేక్రమంలో ఏ చిన్నపాటి నిర్లక్ష్యం చోటు చేసుకున్నా కరోనా బారిన పడటానికి నూటికి నూరుపాళ్లు అవకాశం ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టిన చందంగా టెస్టు శాంపిల్స్ సేకరణ ఉంటుందని చెప్పక తప్పదు. స్రవాల్ని సేకరించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. వాటిని సేకరించిన తర్వాత భద్రపరిచే క్రమంలోనూ మీద పడినా పెను ప్రమాదం మీద పడినట్లేనని చెబుతున్నారు. ఇదంతా చదివినప్పుడు వైద్య సిబ్బంది ఎంతటి డేంజర్ లో పని చేస్తున్నారో అర్థమైపోతుంది.