Begin typing your search above and press return to search.

అనంతపురంలో కరోనా కలకలం .. ఆందోళనలో ప్రజలు

By:  Tupaki Desk   |   13 March 2020 10:15 AM GMT
అనంతపురంలో కరోనా కలకలం .. ఆందోళనలో ప్రజలు
X
కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలనూ భయంతో వణికిపోయేలా చేస్తుంది. తాజాగా అనంతపురం జిల్లాలో కరోనా అలజడి సృష్టిస్తోంది. జిల్లా ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కరోనా అనుమానితులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివరాలు చూస్తే... గుడిబండ మండలం కదిరిమండలం పరాకువాండ్లపల్లిలో.. సయ్యద్‌ అబ్దుల్‌ అనే వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతుండటంతో ఇంటింటి సర్వేలో గుర్తించారు. దీనితో వెంటనే అబ్దుల్‌ ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించి ప్రత్యేక వార్డులో ఉంచారు. సయ్యద్‌ అబ్దుల్‌ హైదారాబాద్‌ లోని ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న నేపాల్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు.

అయితే.. అతన్ని పరామర్శించేందుకు ఆసుపత్రి వెళ్లిన సయ్యద్‌.. ఆ తర్వాత నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. రోజుకురోజుకు అనారోగ్యం క్షీణిస్తుండటంతో.. రెండ్రోజుల క్రితమే సొంత ఊరైన పరాకువాండ్లపల్లి వచ్చాడు. అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోనలకి గురవుతున్నారు. అయితే , ఆయనకి ఇంకా కరోనా సోకినట్టు నిర్దారణ కాలేదు. అతని రక్తనమూనాలని పరిశీలిస్తున్నారు.

ఇక, జిల్లాలో కరోనా అలజడి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా జన సమూహాల దగ్గరికి వెళ్లవద్దన్నారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు ధరించాలని తెలిపారు.