Begin typing your search above and press return to search.
ఆ దేశంలో మళ్లీ కరోనా కలకలం.. సంపూర్ణ లాక్ డౌన్!
By: Tupaki Desk | 31 Oct 2021 2:30 AM GMTఏడాదిన్నర కాలం నుంచి కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించింది. చిన్నాపెద్దా తేడాలేకుండా దాదాపు అన్ని దేశాల్లో విలయతాండవం చేసింది. మహమ్మారి ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఇక ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారు. కాగా గత ఆరు నెలల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో కొవిడ్ కాస్త అదుపులోకి వచ్చిందని నిపుణులు అంటున్నారు. అయితే రష్యాలో మాత్ర వైరస్ ఉద్ధృుతి ఇంకా తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. రోజుకు దాదాపు 40 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని... రోజూ వెయ్యి మంది దాకా మహమ్మారి ధాటికి బలవుతున్నారని రష్యా మీడియో చెబుతోంది. ఇదివరకే సంపూర్ణ లాక్ డౌన్ విధించిన ఈ దేశంలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అక్కడి మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
రష్యాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరణాల సంఖ్య అంతేరీతిలో పెరుగుతున్నందున... ఆ దేశ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వైరస్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు పాక్షిక లాక్ డౌన్ విధించింది. కేవలం అత్యవసర, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే ఈ పాక్షిక లాక్ డౌన్ సత్ఫలితాలు ఇవ్వడం లేదని సమాచారం. పబ్లిక్ ట్రాన్స్ పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేనందున మెట్రో వంటి ప్రయాణాల్లో జనాలు కిక్కిరిసేలా ప్రయాణం చేస్తున్నారని రష్యా మీడియో రిపోర్ట్స్ చెబుతున్నాయి. పైగా హోటళ్లలో టేక్ అవే సౌకర్యం అందుబాటులో ఉండడం వల్ల బారులు తీరుతున్నారని పేర్కొన్నాయి. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా... రష్యా ప్రజలు చాలా సాధారణంగా గుంపులుగా ఉంటున్నారని రష్యా మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఆ దేశంలో ఇస్తున్న స్ఫత్నిక్ టీకాపై అక్కడి ప్రజల్లో ఇంకా అనుమానాలు ఉన్నాయని రష్యా మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది టీకా తీసుకోవడానికి సంకోచిస్తున్నారని పేర్కొన్నారు. అందుకో టీకా పంపిణీ కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో కేవలం 32 శాతం మందికి మాత్రమే టీకా ఇచ్చినట్లు సమాచారం. వ్యాక్సినేషన్ కూడా కేసుల పెరుగుదలకు ఒక కారణమని టాక్. ప్రస్తుతం పాక్షికంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నవంబర్ 9 దాకా ఇదే అమలులో ఉంటుంది.
ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని రష్యా రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇకపోతే సంపూర్ణ లాక్ డౌన్ అనగానే జనాలు మరింతగా రోడ్ల మీదకి వస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం ఎగబడుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే సరుకులు అందుబాటులో ఉండవని... ముందుగానే కొనిపెట్టుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రోజూ 40 వేల మేర కరోనా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. రోజూ వెయ్యి మందికి పైగా మృతి చెందుతున్నారని అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
జనాభా ఎక్కువగాగల మన దేశంలో కరోనా కాస్త అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగడంతో మహమ్మారికి చెక్ పెట్టగలిగామని నిపుణులు అంటున్నారు. దేశంలో దాదాపు సగానికి పైగా కనీసం ఒక మోతాదు టీకా తీసుకున్నారు. మూడో వేవ్ ప్రమాద హెచ్చరికలు ఉన్నా... ప్రస్తుతం జనాలు అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇక కరోనా కోరల నుంచి భారత దేశం సురక్షితమేనని నిపుణులు అంటున్నారు. అయితే మరికొంత కాలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.