Begin typing your search above and press return to search.

కరోనా అలర్ట్.. సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 7:57 AM GMT
కరోనా అలర్ట్.. సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు..!
X
కరోనా మానవాళికి ప్రపంచానికి పరిచయమై అప్పుడే మూడేళ్లు గడిచిపోగా నాలుగో ఏడాదిలోనూ ఆ మహమ్మారితో ప్రజలంతా సహజీవనం చేస్తున్నారు. ఇక కరోనా వెలుగు చూసిన తొలి రోజులు తలచుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అంతలా ఆ మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.

సాటి మనిషిని చూసి భయపడిన రోజులు ఏవైనా ఉన్నాయంటే అవి కరోనా తొలిరోజులేనని చెప్పొచ్చు. మనిషి తుమ్మినా.. దగ్గినా కరోనా అనే భయపడే రోజులు అవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వైద్యులు.. సైంటిస్టుల కృషితో ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించారు. మాస్కులు ధరించడం.. శానిటైజర్లు రాసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకోవడం వంటివి చేశారు.

ఈ క్రమంలోనే సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనడం మానవళికి మళ్లీ ఊపిరి పోసింది. వ్యాక్సిన్ ను విరివిగా ఫార్మా కంపెనీలు అందుబాటులోకి తీసుకురాగా ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాయి. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అన్ని దేశాల్లోని ప్రజలంతా దాదాపుగా కరోనా టీకాలు వేసుకున్నారు.

దీనికి తోడు కరోనా వైరస్ కూడా వేరియంట్ల రూపంలో దాడి చేస్తూ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా కరోనాకు ముందు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చైనాలో ఇటీవల ఒమ్రికాన్ వైరస్.. బీ 7 అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న భారత్ కరోనాపై అప్రమత్తమైంది.

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సైతం రంగంలోకి దిగారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనుసూద్ చేసిన సేవలు ఎవరు మరువలేనివి. ముఖ్యంగా వలస కార్మికులను వారి సొంతూర్లకు తరలించడంలో ఎంతో కృషి చేశాడు.

కరోనా కాలంలో తనకు చెందిన స్టార్ హోటల్ గదులను వైద్యులు.. సిబ్బందికి ఉచితంగా అందించారు. కరోనా రోగులకు ఆక్సిజన్ సిలండర్లను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఎవరు ఎలాంటి సాయం అడిగినా కాదనకుండా సోనూసూద్ చేశారు. ఈ క్రమంలోనే సోను సూద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

మరోసారి భారత్ లో కరోనా భయం మొదలైన నేపథ్యంలో సోనూసుద్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. కరోనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో " నా పాత నెంబర్ పని చేస్తూనే ఉంది.. కరోనా సాయం కోసం సంప్రదించవచ్చు.. సాయం అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను.." అంటూ ట్వీట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.