Begin typing your search above and press return to search.

కరోనా: దేశం మరణాలు అన్ని లక్షలా? దాచేశారా?

By:  Tupaki Desk   |   27 May 2021 8:30 AM GMT
కరోనా: దేశం మరణాలు అన్ని లక్షలా? దాచేశారా?
X
భారతదేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం కోవిడ్ -19 కేసులను తక్కువగా నివేదిస్తోందని ఆరోపణలున్నాయి. ఎందుకంటే బయట ఉన్న కరోనా కేసులు, మరణాలకు.. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు అస్సలు పొంతనే లేదన్నది వాస్తవం అంటున్నారు. వైరస్ సంబంధిత మరణాలను రాష్ట్రాలు బాగా దాచేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 2.7 కోట్ల కేసులు నమోదయ్యాయి. కేవలం 3 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

అయితే అమెరికాకు చెందిన టాప్ మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ భారతదేశంలో నిజంగా 40 లక్షల కోవిడ్ -19 మరణాలు సంభవించవచ్చని సంచలన కథనాన్ని వండివార్చింది. "పేలవమైన రికార్డులు ", "విస్తృతమైన పరీక్ష లేకపోవడం".. "భారతదేశం మహమ్మారి నిజమైన స్థితిని బాగా అర్థం చేసుకోకపోవడంతో మరణాలు" బాగా సంభవించాయని న్యూయార్క్ టైమ్స్ దాని ప్రత్యేక వ్యాసంలో ప్రధాన కారణాలుగా చూపింది.

ఈ కథనాన్ని ప్రచురించే ముందు, న్యూయార్క్ టైమ్స్ విస్తృతమైన పరిశోధనలు చేసింది. కేసులు.. మరణాల సంఖ్యను విశ్లేషించడానికి నిపుణులతో మాట్లాడింది. వారి విశ్లేషణలో, న్యూయార్స్ టైమ్స్ అంచనా ప్రకారం ఈ కేసులు అధికారిక గణాంకాల కంటే 15 రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది. మరణాల సంఖ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో లభించిన డేటా కంటే రెండు రెట్లు ఎక్కువ అని తేల్చారు.

మొదటి వేవ్ లో సంక్రమణ..మరణాల రేటు తక్కువగా ఉందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. కానీ సెకండ్ వేవ్ విషయాలను మరింత దిగజార్చింది. రాబోయే రోజుల్లో సంక్రమణ.. మరణాల అంచనాలు పెరగవచ్చని తెలిపింది. కేసుల సంఖ్య 26 శాతం పెరగవచ్చని.. సుమారు 70 కోట్ల మంది భారతీయులు వైరస్ బారిన పడవచ్చని బాంబు పేల్చింది. అయితే మరణాల రేటు 14 రెట్లు అధికంగా ఉండవచ్చు మరియు 42 లక్షల మంది చనిపోయి ఉండొచ్చని అంచనావేసింది.

న్యూయార్క్ టైమ్స్ నివేదికను తోసిపుచ్చలేని విధంగా ఉంది.. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులను తక్కువగా నివేదిస్తున్నాయి. వైరస్ కలిగి ఉన్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. తెలంగాణలో మొత్తంగా 100 కూడా మరణాలు దాటని పరిస్థితి నెలకొంది.