Begin typing your search above and press return to search.

14 వేల కోట్ల‌నే పేద‌ల‌కు పంచేశాడు

By:  Tupaki Desk   |   1 Dec 2016 10:30 PM GMT
14 వేల కోట్ల‌నే పేద‌ల‌కు పంచేశాడు
X
అవును మీరు స‌రిగానే చ‌దివారు. అక్ష‌రాల 14వేల కోట్ల రూపాయ‌ల‌ను పేద‌ల‌కు పంచేశారు. స్పెయిన్‌ కు చెందిన వ్యాపార‌వేత్త ఆంటొనినో ఫెర్నాండెజ్ త‌న ఊరి ప్ర‌జ‌ల కోసం ఇంత మొత్తాన్ని విత‌ర‌ణ‌గా పంచేశాడు. 1917లో స్పెయిన్‌ లోని సెరెజల్స్‌ డెల్‌ కొండాడొ గ్రామంలో నిరుపేద కుటుంబంలో అంటొనినో జ‌న్మించాడు. అత‌నికి 13 మంది అక్కచెల్లెలు ఉన్నారు. అయితే అంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి సంపాద‌న చాల‌లేదు. దీంతో ఫెర్నాండెజ్ 14 ఏళ్ల వ‌య‌స్సులో చ‌దువుకు స్వ‌స్తి చెప్పి కుటుంబ పోష‌ణ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. ఆ క్ర‌మంలోనే బ‌తుకు దెరువు నిమిత్తం 1949లో భార్య‌తో క‌లిసి మెక్సికో వ‌ల‌స వెళ్లాడు. అక్క‌డ అనుకోకుండా అదృష్ట‌వ‌శాత్తూ ఓ ప్ర‌ముఖ పానీయాల త‌యారీ సంస్థ‌లో ఉద్యోగం సాధించాడు. అందులోనే క‌ష్ట‌ప‌డి సీఈవో స్థాయికి ఎదిగాడు. అనంత‌రం బ‌య‌టికి వ‌చ్చి సొంతంగా బీర్ల‌ను త‌యారు చేసే కంపెనీ పెట్టాడు. దాని ద్వారా వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జించాడు.

ఇది ఆంటొనినో ఫెర్నాండెజ్ జీవ‌న ప్ర‌స్తానం. అయితే వేల‌కోట్ల ధ‌న‌వంతుడిగా ఎదిగినప్ప‌టికీ త‌న సొంత ఊరిని మాత్రం ఫెర్నాండెజ్ మ‌రువ‌లేదు. సాధార‌ణంగా దాన‌గుణం ఉన్న‌వారు ఊరిని ద‌త్త‌త తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తారు. కానీ ఈ వ్యాపార‌వేత్తం మాత్రం అలా చేయ‌లేదు. అందుకు భిన్నంగా కొంచెం ముందుకు వెళ్లి ఏకంగా తాను సంపాదించిన రూ.14వేల కోట్ల ఆస్తిని త‌న ఊరి ప్ర‌జ‌లకు రాసిచ్చేశాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.17.50 కోట్ల దాకా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆ ఊరివాసులు రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయ్యారు. ఇప్పుడ‌క్క‌డ పేద వారు అస్స‌లు క‌న‌బ‌డరు. కాగా ఈ ఏడాది ఆగ‌స్ట్ నెల‌లో ఫెర్నాండెజ్ (99) మృతి చెందాడు. అయిన‌ప్ప‌టికీ త‌న ఊరి వాసులు ఆయ‌న్ను మ‌రిచిపోలేదు. ఆయ‌న పేరిట ఆల‌యాన్ని క‌ట్టించి అందులో ఫెర్నాండెజ్‌ను దేవుడిగా కొలుస్తున్నారు. నిత్యం ఆయ‌న‌కు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/