Begin typing your search above and press return to search.
కరోనా కాటుకు దేశంలో హాఫ్ మిలియన్ మంది బలి!
By: Tupaki Desk | 5 Feb 2022 6:26 AM GMTగత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేరియంట్ల రూపంలో పంజా విసురుతోంది. ఉప్పెనలా విరుచుకుపడుతూ ఎంతోమందిని బలిగొంది. మన దేశంలో ఇప్పటివరకు మూడు దశల్లో మహమ్మారి విరుచుకుపడింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పాజిటివ్ కేసులు మరోసారి విపరీతంగా పెరిగాయి. కాగా గత నెల మూడో వారం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో రోజూవారీ బాధితుల సంఖ్య రెండు లక్షల దిగువకు చేరింది.
కరోనా తొలి దశలో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. కానీ రెండో దశలో మాత్రం మరణ మృదంగం మోగింది. ఎంతో మంది ప్రాణవాయువు అందక అల్లాడిపోయారు. ఆత్మీయుల చేతిలో ప్రాణాలు విడిచారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో చాలా మంది బలయ్యారు. గతేడాది మార్చి నుంచి జూన్ వరకు ఈ విలయతాండవం జరిగింది. అప్పుడే రికార్డు స్థాయిలో మృతుల సంఖ్య పెరిగింది. కాగా గత ఏడాది జూలై 1 నాటికి మృతుల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది.
కరోనా మూడు దశల్లో మొత్తం మరణాల సంఖ్య ఐదు లక్షలకు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు 5,00,055 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు అని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,49,394 మంది కరోనా బారిన పడినట్లు పేర్కొంది. ఇక 1,072 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు అని తెలియజేసింది. పాజిటివిటీ రేటు 9.27గా నమోదైంది. దేశంలో మొత్తం 4.19 కోట్ల మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం 14.35 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేసింది.
గత ఏడాది జూలై 1 నాటికి నాలుగు లక్షల మరణాలు నమోదయ్యాయి. కాగా 217 రోజుల్లో మరో లక్ష మంది కరోనా కాటుకు బలయ్యారు. కాగా దేశంలో మొత్తం ఐదు లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఎక్కువ మంది వైరస్ బారిన పడి బలయ్యారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,42,859 మంది మరణించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.
కేరళ-56,721
కర్ణాటక-39,197
తమిళనాడు-37,666
దిల్లీ-25,932
ఉత్తర ప్రదేశ్-23,277