Begin typing your search above and press return to search.

కరోనా వారికి మాత్రం గుడ్ న్యూస్ ల్ని తెచ్చి పెట్టిందట

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
కరోనా వారికి మాత్రం గుడ్ న్యూస్ ల్ని తెచ్చి పెట్టిందట
X
మీరు చదవింది కరెక్టే. ప్రపంచం మొత్తం ఆగమాగమైపోతే.. కరోనా కారణంగా గుడ్ న్యూస్ ఎలా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. వాస్తవం తెలిస్తే.. ఇలా కూడా ఉంటుందా? అనుకోకుండా ఉండలేం. దేశంలో ఎన్నో కులాలు.. వర్గాలు ఉన్న విషయం తెలిసిందే. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. కరోనా కారణంగా పార్సీ కుటుంబాల్లో మాత్రం శుభవార్తలే శుభవార్తలుగా చెబుతున్నారు. గత ఏడాదిలో వారి కమ్యునిటీలో 61 మంది పుట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. ఇంత పెద్ద ఎత్తున జననాలు ఒక ఏడాదిలో చోటు చేసుకోవటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశంలో పార్సీల జనాభా 57 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో.. వారి సంఖ్యను పెంచటానికి కేంద్ర ప్రభుత్వం జియో పార్సీ స్కీం పేరిట ఒక పథకాన్ని తీసుకొచ్చింది. పార్సీల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే..గత ఏడాది మార్చిలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి పని చేసే అవకాశం లభించటం..ఇంటి వద్దే ఎక్కువ సమయాన్ని గడపాల్సి రావటం తెలిసిందే. దీంతో.. పిల్లలు ఎక్కువ మంది పుట్టటానికి కారణమైందని చెబుతున్నారు. గత ఏడాదిలో 61 మంది పుట్టగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 22 మంది పుట్టినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పుట్టే వీలుందని చెబుతున్నారు.

ఏడాదిలో ఒక కమ్యునిటీలో 61 మంది పుడితే అదో విషయమా? అని సింఫుల్ గా తీసిపారేయొద్దు. ఇదెంత పెద్ద విషయం అన్నది గత గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. గతంలో ఏడాదిలో పార్సీల కుటుంబాల్లో జననాల రేటు చాలా చాలా తక్కువగా ఉంటుందని.. ఏడాదిలో అరవై మంది పుట్టటం చాలా పెద్ద విషయంగా వారు చెబుతున్నారు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా.. అతి చిన్నదైన పార్సీ కమ్యునిటీకి మాత్రం కరోనా కొంతమేర కలిసి వచ్చిందన్న మాట వినిపిస్తోంది.