Begin typing your search above and press return to search.
గాలిలో కరోనా మరింత చేరువ
By: Tupaki Desk | 19 Sep 2021 7:40 AM GMTచైనాలోని వూహాన్ లో పుట్టిన మాయదారి కరోనా వైరస్ రూపాలు మార్చుకుంటూ ఇప్పటికీ కూడా విరుచుకుపడుతూనే ఉంది. ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్ గా మారిపోయింది. అయితే అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ జోరుగా సాగడంతో ఇప్పుడు వైరస్ కు అడ్డుకట్ట పడుతోంది.వేగంగా వ్యాక్సినేషన్ అమలు చేస్తుండడంతో కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం ఇంకా ఉధృతి అదుపులోకి రావడం లేదు.
ప్రస్తుతం అన్నింటికంటే డెల్టా వేరియంట్ డేంజర్ అయినప్పటికీ అల్ఫా వేరియంట్ సైతం ఎక్కువ దేశాల్లో వ్యాపించింది. ఈ వేరియంట్ లు ముక్కు, కళ్లు, నోరు, పిత్తడం ద్వారా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిపోయింది.
ఈ వేరియంట్ లో ఇప్పుడు గాలిద్వారా వ్యాప్తి చెందేలా రూపాంతరం చెందుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ మేరిలాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.
సాధారణ కరోనా కంటే ఆల్ఫా వేరియంట్లు 43 నుంచి 100శాతం వైరస్ రేణువులను గాల్లోకి వెదజల్లుతున్నాయని.. సర్జికల్ లేదా గుడ్డ మాస్క్ లు కొంతవరకు అడ్డుకోగలుగుతున్నాయని తేల్చారు. పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని..కరోనా వేరియంట్ లో డేంజర్ గా చెప్పుకుంటున్నా డెల్టా కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందే విధంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని.. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కానీ ఇఫ్పుడు కొత్త పరిశోధనలో కరోనా వ్యాప్తికి దూరం తగ్గిపోయిందని తెలిసింది. ఇన్నాళ్లు కనీసం ఆరు అడుగులు లేదా 4.8 మీటర్ల దూరం ఉంటే కరోనా రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పుడా దూరం సరిపోదని తేలింది.
పరిశోధనలో వైరస్ వ్యాప్తిపై సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గాలి ద్వారా వ్యాపించడానికి ఆధారాలు వారు కనుగొన్నారు. వైరస్ వ్యాప్తిపై మార్గదర్శకాలు సవరించాలని పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరారు.
ఇండోర్ వాతావరణంలో 2 మీటర్ల నుంచి 4.8 మీటర్ల దూరం వరకు గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ రేణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని తేల్చిచెప్పారు. దగ్గుతూ, చీదుతూ, మాట్లాడే వారి సమీపంలో గాలి పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని తెలిపారు.
కొత్త పరిశోధనలో వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మార్గదర్శకాలు మార్చాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.