Begin typing your search above and press return to search.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..కొత్త వేరియంట్ వ్యాప్తే కారణం

By:  Tupaki Desk   |   3 May 2021 12:30 PM GMT
ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..కొత్త వేరియంట్ వ్యాప్తే కారణం
X
దేశంలో మొదటి వేవ్ లో కరోనా పెద్ద ఎఫెక్ట్ చూపలేదు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. మరణాల శాతం కూడా అంతే విధంగా పెరిగింది. అయితే దానికి కారణం కొత్త కరోనా వేరియంటేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. బి.1.617, 618 వెరియంట్ వల్ల దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మూడు వారాల కిందట కూడా పెద్దగా కరోనా వైరస్ ప్రభావం లేదు. అయితే ఆ తర్వాత క్రమేణా పాజిటివ్ కేసులు వందలు, వేల ల్లోకి పెరుగుతూ వచ్చాయి. చూస్తుండగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ప్రతి రోజూ 20 వేలకు పైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,14,299 మందికి కరోనా పరీక్షలు చేయగా 23,920 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 83 మంది కరోనా కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో ఎన్ 440 కే వేరియంట్ గతంలో కన్నా 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు వారు చెబుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇన్ని కేసులు, ఇన్ని మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

రేపటి నుంచి ఏపీలో మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాల మూత రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. అదీకాక కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించి ఇందుకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.