Begin typing your search above and press return to search.

దేశంలో 25 లక్షలు దాటినా కరోనా కేసులు

By:  Tupaki Desk   |   15 Aug 2020 12:40 PM IST
దేశంలో 25 లక్షలు దాటినా కరోనా కేసులు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఓ వైపు ముమ్మర ప్రయోగాలు కొనసాగుతుండగా...మరోవైపు కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి గత రికార్డ్స్ ను బద్దలు కొడుతూ వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకి కరోనా భారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 65,002 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 996 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనితో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,26,193కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,036 కి పెరిగింది. ఇక 6,68,220 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,08,937 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,68,679 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ఇండియాలో ప్రస్తుతం మరణాల రేటు 1.9 శాతంగా ఉండగా, ప్రపంచంలో అది 3.57గా ఉండటం కొంచెం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్ తరవాత మూడో స్థానంలో ఉంది. రోజువారీగా నమోదు అయ్యే కరోనా కేసుల్లో భారత్ టాప్ పొజిషన్‌ లో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా ఉంది.

ఇక , తెలంగాణ కరోనా కేసుల విషయానికొస్తే .. రాష్ట్రంలో కొత్తగా మరో 1,863 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు, 1912 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,259కు చేరింది. అందులో ప్రస్తుతం 23,379 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 66,196 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 684 కి చేరింది.

ఇక ఏపీ విషయానికొస్తే .. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8943 కరోనా పాజిటివ్ కేసులు . 97 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2475కి చేరింది. అలాగే, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,085కి పెరిగింది.