Begin typing your search above and press return to search.
కరోనాతో ప్రపంచం వణికే వేళ..వైరస్ పుట్టింట్లో సీన్ రివర్స్
By: Tupaki Desk | 14 March 2020 1:30 AM GMTమూడక్షరాల కరోనా మాట విన్నంతనే ఉలిక్కిపడుతున్నారు. ఎదుటోళ్లు దగ్గుతున్నా లైట్ తీసుకునే పరిస్థితి నుంచి.. ఎవరి నోటి నుంచైనా పొరపాటున పొడి దగ్గు వచ్చినా ఆమడదూరానికి పరుగులు తీస్తున్నారు. ఇక.. జలుబు ఉందని.. జ్వరం వస్తుందన్న మాట వింటే చాలు.. ఎంత సన్నిహితులైనా సరే.. దూరమైపోతున్నారు. ఇలా కరోనా ప్రపంచ వ్యాప్తంగా వణికేలా చేస్తోంది.
కరోనా వైరస్ తీవ్రత గడిచిన మూడు నాలుగు రోజులుగా ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తోంది. మొన్నటివరకూ ఈ సమస్య ఒక్క చైనాది మాత్రమే అన్నట్లుగా వ్యవహరించిన చాలా దేశాలు.. తాము చేసిన తప్పునకు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేయాలంటే.. ఆ వైరస్ ను దేశంలోకి రాకుండా చూసుకోవాలే కానీ.. ఒకసారి వచ్చాక దాన్ని నియంత్రించటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోకూడదు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా అంతకంతకూ విస్తరిస్తుంటే.. చైనాలో సదరు వైరస్ కు పుట్టినింట్లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. మొన్నటి వరకూ ఈ పిశాచి వైరస్ కారణంగా చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ వణికిపోయింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో రెండింట మూడొంతులు సెంట్రల్ హుబేయ్ ప్రావిన్స్ లోనే నమోదయ్యాయి. అయితే.. ఈ వైరస్ విషయంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవటం.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న కారణంగా.. ఇప్పుడా ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు కొత్తవి నమోదు కావటం తగ్గిపోయింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ.. ఈ వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ.. ఇందుకు భిన్నంగా హుబేయ్ లో సీన్ ఉందని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యవహారం బయట పడిన తర్వాత తొలిసారి.. గురువారం వెలుగు చూసిన కొత్త కేసులు సింగిల్ డిజిట్ కు పడిపోవటం.. వారు సాధించిన ఘన విజయంగా చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొత్త కేసులు వెలుగు చూడటం అంతకంతకూ తగ్గిపోతున్నాయి.
చైనాలోని ఇతర నగరాల్లో హుబేయ్ కు కాంటాక్టును తీసేయటమే కాదు.. రాకపోకల మీద కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. హుబేయ్ ను దిగ్బంధించటంతో పాటు.. ఆ ప్రావిన్సులోని వారు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా.. ఇల్లకే పరిమితమయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. హుబేయ్ లో ఏ విధంగా అయితే నియంత్రణ చర్యలు చేపట్టారో.. ఇప్పుడు అలాంటి విధానాల్నే ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తే తప్పించి కరోనా ఒక కొలిక్కి రాదన్న మాట వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేయటానికి ఎవరికి వారు తీసుకునే నిర్ణయం కంటే కూడా.. ప్రపంచం మొత్తం ఏకమై.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. మానవాళికి సవాలు విసురుతోన్న కరోనా పై యావత్ ప్రపంచం కలిసి కట్టుగా యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినట్లే.