Begin typing your search above and press return to search.
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా .. కొత్తగా 4,872 పాజిటివ్ కేసులు !
By: Tupaki Desk | 7 Jun 2021 1:30 PM GMTఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టు కనిపిస్తుంది. కొత్తగా గత 24 గంటల వ్యవధిలో 64,800 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,872 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే , కొత్తగా మరో 86 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 13,702 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,14,510 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
కొత్తగా కరోనాతో చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 మంది మృతి చెందారు. శ్రీకాకుళంలో 9; విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు చొప్పున ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 961 కేసులు వెలుగుచూశాయి. తూ గో జిల్లాలో 810, అనంతపురం జిల్లాలో 535, ప్రకాశం జిల్లాలో 447 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని రెడీ చేయాలని సూచించారు. కొవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్ సమగ్రంగా చర్చించారు. థర్డ్ వేవ్ పై అనాలసిస్, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పోషకాహార పంపిణీ, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు.