Begin typing your search above and press return to search.
దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ .. కొత్తగా ఎన్ని కేసులంటే!
By: Tupaki Desk | 4 Aug 2021 6:32 AM GMTమనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రోజూవారి నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 42,625 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే , దేశంలో మొన్న 30,549 కొత్త కరోనా కేసులు మాత్రమే వచ్చాయి . ఇక తాజాగా నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 4,10,353 యాక్టివ్ కేసులు ఉండగా, 3,09,33,022 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అటు నిన్న 562 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,25,757కి చేరుకుంది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.13 శాతంగా ఉంది. నిన్న కొత్తగా 36,668 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 4,10,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,47,518 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 47 కోట్ల 31 లక్షల 42 వేల 307 టెస్టులు చేశారు. కొత్తగా 62,53,741 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 48 కోట్ల 52 లక్షల 86 వేల 570 వ్యాక్సిన్లు వేశారు. అటు ఇప్పటిదాకా 48,52,86,570 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 23.68వేల కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 6వేలు, తమిళనాడులో 1.9 వేల కేసులు వచ్చాయి. కేరళలో గత 68 రోజుల్లో అత్యధిక కేసులు నిన్నే వచ్చాయి. మొత్తం కొత్త కేసుల్లో కేరళవి 55.5 శాతం ఉన్నాయి. అలాగే యాక్టివ్ కేసుల్లో 42.3 శాతం కేరళవే ఉన్నాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 177 కొత్త మరణాలు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 148, ఒడిశాలో 69 నమోదయ్యాయి. ప్రస్తుతం 14 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు 20 కోట్లు దాటాయి. నిన్న కొత్తగా 5,90,302 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.02 కోట్లు దాటింది. కొత్తగా 9,324 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 42.57 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.54 కోట్లు ఉన్నాయి. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 95,598 కేసులు, 478 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో నిన్న 32,316 కొత్త కేసులు, 1,073 మరణాలు సంభవించాయి.