Begin typing your search above and press return to search.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు .. కొత్తగా ఎన్నంటే ?
By: Tupaki Desk | 19 Jun 2021 6:30 AM GMTమనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో నమోదు అయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. ఇండియాలో కొత్తగా 60,753 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. కొత్తగా 1,647 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,85,137కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది.
ఇండియాలో తాజాగా 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,86,78,390కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.2 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,02,009 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 38 కోట్ల 92 లక్షల 07 వేల 637 టెస్టులు చేశారు. కొత్తగా 33,00,085 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 27 కోట్ల 23 లక్షల 88 వేల 783 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. యాక్టివ్ కేసులు మరింత తగ్గి... 74 రోజుల దిగువ స్థాయికి చేరాయి. అలాగే వరుసగా 37వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. రికవరీ రేటు మరింత పెరిగి 96.16 శాతానికి చేరడం మంచి విషయం. వీక్లీ పాజిటివిటీ రేటు కంటిన్యూగా 5 శాతం కంటే తక్కువే ఉంటోంది. ప్రస్తుతం అది 3.58 శాతం ఉంది.