Begin typing your search above and press return to search.
చైనాలో మళ్లీ కరోనా కేసులు.. ఆపిల్ కంపెనీలో ఉద్రిక్తత..!
By: Tupaki Desk | 23 Nov 2022 1:30 PM GMTకరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి మహమ్మరి విజృంభిస్తోంది. 2020 ప్రారంభంలో చైనాలోని వ్యూహాన్ నగరంలో కరోనా మహమ్మరి వెలుగు చూసింది. అక్కడి నుంచి క్రమంగా ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా పాకింది. ఈ మహమ్మరి ధాటికి అగ్ర రాజ్యలు సైతం కుదేలయ్యాయి. అమెరికా.. ఇటలీ లాంటి దేశాల్లో కరోనా మరణాలు లక్షల్లో నమోదుకాగా వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా ధాటికి అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి. దీంతో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. ఈ కాలంలో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యాపారులు, కంపెనీలు మూతపడటంతో వేలాది మంది రోడ్డున పడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడిప్పుడు ప్రపంచం కరోనా నుంచి కోలుకుంటోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్న సమయంలో చైనాలో తిరిగి కరోనా కేసులు పెరుగుతుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. చైనాలో ప్రస్తుతం రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కోవిడ్ ను నిర్మూలించేందుకు చైనా ప్రభుత్వం 'జీరో కోవిడ్' విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా లాక్ డౌన్ అమలు చేస్తుంది.
అయితే తన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చైనా ఫ్యాక్టరీల్లో తయారీకి అనుమతి ఇచ్చింది. కంపెనీల్లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అనుమానితులను అందులో ఉంచుతున్నారు. గత కొన్ని నెలలుగా కార్మికులంతా ఫ్యాక్టరీల్లోనే మగ్గుతున్నాయి. సిబ్బంది బయటికి వెళ్లకుండా కొన్ని చోట్ల ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది.. కార్మికులు నెలల తరబడి క్వారంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారంతా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫ్యాక్స్ కాన్ ప్లాంట్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే ఫ్యాక్టరీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కార్మికులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఆ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు జెంగ్ ఝౌ ప్లాంట్ లో పని చేసే సిబ్బంది లాక్ డౌన్ కు భయపడి పారిపోయారు. దాదాపు రెండు లక్షల మంది ఇందులో పని చేస్తుండగా లక్షమంది వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెలన్నర క్రితం కంపెనీ భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకుంది. అయితే నాటి నుంచి వారిని కంపెనీ నుంచి బయటికి పంపించడం లేదని తెలుస్తోంది.
వీరికి జీతాలు కూడా ఇవ్వకుండా కంపెనీలో ఉంచుతున్నారని పలువురు సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలపై చైనా ప్రభుత్వం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో చైనాలో ఏం జరుగుతుందనేది క్లారిటీ రావడం లేదు. చైనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని చుట్టి వేస్తుందా? అన్న భయాందోళనలు ప్రతి ఒక్కరిలో నెలకొంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

河南富士康全民抗暴政,喊殺震天警車砸爛 中共大白防疫兵被打的抱頭鼠竄,替全國老百姓出了一口惡氣,真痛快。 pic.twitter.com/RmvMSdwQKu
— 界立建 (@jielijian) November 23, 2022