Begin typing your search above and press return to search.
సూర్యాపేటలో కలకలం... సర్కారులో ఆందోళన - స్కోరు 700
By: Tupaki Desk | 16 April 2020 3:33 PM GMTతెలంగాణలో కరోనా పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రభుత్వం ఊహిస్తున్నది ఒకటి... జరుగుతున్నది మరొకటిగా ఉంది. ఈరోజు కొత్తగా 50 కేసులు నమోదు కావడంతో సర్కారుతో పాటు ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 700కి చేరుకుంది. అయితే, ఒకే ఒక్క సంతోషకరమైన వార్త ఏంటంటే... ఈరోజు ఒక్కటే 68 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. దీంతో తెలంగాణలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 496 వద్ద ఉంది. ఇప్పటివరకు మొత్తం 186 మంది డిశ్చార్జి అయ్యారు.
సూర్యాపేటలో కేసులు అనూహ్యంగా పెరగడం ప్రభుత్వానికి షాకిస్తోంది. గురువారం ఒక్క రోజే సూర్యపేటలో 16 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 23కి పెరిగింది. ఈ కేసులతో టచ్ లో ఉన్న వారిని ట్రేస్ చేసేపనిలో ఉన్నారు. ఇప్పటివరకు దొరికిన వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు. అసలు సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున కేసులు బయటపడటం జిల్లా వాసుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఎప్పటికపుడు ఇక కొత్త కేసులు ఉండవు అనుకోవడం.... ఆ తర్వాత పెరగడం అనేది కామన్ అయిపోయింది.
ఒకవైపు జాగ్రత్త పడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో లక్ష మందికి వచ్చినా దీటుగా ఎదుర్కోవడానికి సరిపోయినన్ని ఆస్ప్రత్రులు, సదుపాయాలు రెడీగా ఉంచినట్లు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. జాగ్రత్తగా ఉండి తరిమి కొట్టడం తప్ప ఇప్పటికిపుడు మన చేతుల్లో ఏం లేదని ఆయన తేల్చారు. అయితే... దీనిని ఆపగలిగిన శక్తి ప్రజలకే ఉందని... ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడవచ్చని ప్రభుత్వం పిలుపునిచ్చింది.