Begin typing your search above and press return to search.

పల్లీల వ్యాపారికి కరోనా..ఎంతమందికి అంటించాడంటే?

By:  Tupaki Desk   |   2 May 2020 1:00 PM GMT
పల్లీల వ్యాపారికి కరోనా..ఎంతమందికి అంటించాడంటే?
X
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గత వారం రోజుల ముందు వరకు భారీగా నమోదు అవుతూ ..రాష్ట్ర ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేశాయి. రాష్ట్రాల్లో కరోనా కేసులని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే , ప్రభుత్వం అలసత్వం వహించకుండా అమలు చేస్తున్న నిబంధనలు మరింత కఠినతరం చేయడంతో... ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.

అయితే, ఇప్పుడు కొందరి నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన చాలా కేసులు ఇలా ఇతరుల నిర్లక్ష్యం కారణంగానే అని చెప్పవచ్చు. ఎవరో చేసిన తప్పుకు ఇతరులు బలి కావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా నమోదు అవుతున్న కేసులన్నీ కూడా దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో నుండి వచ్చినవే.

తాజాగా హైదరాబాద్ లో ఓ పల్లీల వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. సరూర్ నగర్ కు చెందిన మలక్ పేట్ లోని పల్లీల వ్యాపారికి కరోనా పాజిటివ్ రాగా అతడి నుండి మొత్తం ఐదుగురికి ఈ వైరస్ సోకింది అని అధికారులు గుర్తించారు. వారిలో అతని కుటుంబ సభ్యులతో పాటు వనస్థలిపురం లోని ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా బాధితులను అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. అలాగే ఇంకా అతడు ఎవరెవరిని కలిసాడు అనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా , కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1044కు చేరింది. ఇందులో 442 మంది ఇప్పటికే కోలుకోగా.. శుక్రవారం మరో 22 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 464కు చేరింది. మరో 552 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 28 మంది మరణించారు.