Begin typing your search above and press return to search.

రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగనున్నాయా?

By:  Tupaki Desk   |   6 April 2020 4:15 AM GMT
రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగనున్నాయా?
X
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తీసుకుంటే.. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంత వేగంగా.. గడిచిన నాలుగైదు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఓపక్క లాక్ డౌన్ అమలవుతున్నా..రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకటిస్తున్న కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్లు? ఈ పెరుగుదల ఎప్పటివరకూ కంటిన్యూ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల పదో తేదీ వరకూ కేసుల సంఖ్య ఎక్కువ గా నమోదు కావటం ఖాయమని చెప్పక తప్పదు. ఎందుకిలా? అంటే.. ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కట్టడి చేయటం.. ఇప్పటికే వచ్చిన వారే కానీ.. కొత్తగా వచ్చే వారు లేకపోవటంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టే అవకాశం కలిగింది. విదేశాల నుంచి వచ్చిన వారంతా పద్నాలుగు రోజులు దాటిపోవటం.. వారిని విజయవంతంగా క్వారంటైన్ చేయటంతో పెను ముప్పు తప్పింది. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా వైరస్ వ్యాప్తిని మొదటి..రెండో దశల్లోనే నిలువరించామని చెప్పాలి.

ఈ సంతోషంలో ఉన్నప్పుడే.. ఊహించని రీతిలో మర్కజ్ ఎపిసోడ్ చోటు చేసుకోవటం.. దానిపై అలెర్ట్ అయ్యే లోపే.. దేశ వ్యాప్తంగా పాకిపోయింది. అప్పటికి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పని చేసిన నేపథ్యం లో..మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారినే కాదు.. వారు కాంటాక్ట్ అయిన వారిని దాదాపుగా ట్రేస్ చేసినట్లు చెప్పాలి. మర్కజ్ వెళ్లిన వారంతా ఇళ్లకు వెళ్లింది మార్చి 17 నుంచి 19 మధ్యలో. సరాసరిన మార్చి 18ను లెక్కలోకి తీసుకుంటే.. అక్కడి నుంచి 14 రోజులు వైరస్ కు ఇంక్యుబేషన్ పిరియడ్ గా తీసుకోవాలి. అలా చూసినప్పుడు ఏప్రిల్ రెండు.. మూడు తారీఖులుగా కనిపిస్తాయి.

ఈ గడువు సమయానికి దేశ వ్యాప్తంగా మర్కజ్ కు వెళ్లిన వారు.. వారితో కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ లోకి తీసుకెళ్లిపోయారు. వీరందరికి క్రమపద్దతిలో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవంగా చూస్తే.. కాస్త లేట్ అవుతుందన్నది ఒప్పుకోవాల్సిందే. ఈ కారణంతోనే గడిచిన నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చే సరికి మార్చి పది వరకూ పడుతుంది. అప్పటికి కరోనా పిక్చర్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటికి కానీ కరోనా పాజిటివ్ లెక్క ఏంది? దేశాన్ని ఈ మహమ్మారి వైరస్ మరెంత పీడించనుందన్న అంశం మీద అవగాహన కలిగే అవకాశం ఉందని చెప్పాలి.