Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాల్లో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు.. దేశంలో సెకెండ్ వేవ్?

By:  Tupaki Desk   |   21 Feb 2021 12:30 PM GMT
ఆ రాష్ట్రాల్లో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు.. దేశంలో సెకెండ్ వేవ్?
X
‘కరోనా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ జరుగుతోంది. కొత్తకేసులు కూడా రావడం లేదు.’ దేశంలోని చాలామంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కరోనా తగ్గిపోయిందని కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా కొత్తకేసులు కలవరం సృష్టిస్తున్నాయి. పంజాబ్​ - మహారాష్ట్ర - కేరళ, -మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్​ డౌన్​ - కఠిన నిబంధనలు కూడా విధిస్తున్నారు.

మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్​ కేసులు పెరుగుతున్నట్టు సమాచారం. విదర్భ - ముంబైలోని కొన్నిప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు - వైద్యవర్గాల్లో ఆందోళన నెలకొన్నది. శుక్రవారం దేశవ్యాప్తంగా 14 వేల కేసులు నమోదయ్యాయి. 101 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 16న 9,121 కేసులు - ఫిబ్రవరి 17న 11,610 కేసులు ఫిబ్రవరి 18న 12,881 - ఫిబ్రవరి 19న 13,193 - ఫిబ్రవరి 20న 13,993 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.

అయితే కేరళ - మహారాష్ట్ర - పంజాబ్ - మధ్యప్రదేశ్‌ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్​ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదయిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కేరళ ఉంది. ప్రస్తుతం అక్కడ 60వేల యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 42 శాతం.

మహారాష్ట్రాలో కొత్త స్ట్రెయిన్​ కరోనా కేసులు నమోదవుతున్నట్టు అధికారులు అంటున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అలర్టయ్యింది.