Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పెరిగిపోతున్న కరోనా కేసులు !

By:  Tupaki Desk   |   2 April 2020 12:44 PM GMT
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పెరిగిపోతున్న కరోనా కేసులు !
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా లేవు అని ఆనంద పడుతున్న సమయంలో .. ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో బయటపడుతుండటంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్కజ్ నుంచి వచ్చిన యాత్రికుల నుంచి వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఏపీ అప్రమత్తం అయ్యింది. గడిచిన మూడు రోజుల్లోనే వైరస్ కేసులు వేగంగా పెరిగిపోయాయి.

ఈరోజు ఉదయం వరకు 132 పాజిటివ్ కేసులు ఉండగా, తాజా సమాచారం ప్రకారం మరో మూడు పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ మూడు పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం 135 కేసులు పెరిగాయి. ఇదిలా ఉంటె, కడప - గుంటూరు - విశాఖ నగరాల్లో కొత్తగా కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్టయితే రోజుకు 450 నుంచి 570 వరకు కరోనా శాంపిల్స్ ను పరీక్షించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఢిల్లీ మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న 1085 మందిలో ఇప్పటి వరకు 758 మంది నుంచి శాంపిల్స్ ను సేకరించినట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలోనే రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర జిల్లాలకు సరిహద్దులను కంట్రోల్ చేసింది. దేశంలో ఈ జిల్లాలకు చెందిన వారు ఉండడం.. తిరిగి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా..అప్పటికే ఆలస్యం అయిపోయింది. అధికారులు తీసుకున్న చర్యలతో ఎక్కడి వారెక్కడే ఉండిపోయారు. ఇకపోతే , దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది.