Begin typing your search above and press return to search.

దేశంలో మళ్లీ క‌రోనా విజృంభణ .. భారీగా పెరుగుతోన్న కేసుల

By:  Tupaki Desk   |   30 Aug 2021 6:30 AM GMT
దేశంలో మళ్లీ క‌రోనా విజృంభణ .. భారీగా పెరుగుతోన్న కేసుల
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. తాజాగా కొత్తగా 42,909 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,27,37,939కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 380 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,38,210కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 34,763 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,19,23,405కి చేరింది. రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌ లో 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,19,990 టెస్టులు చేశారు.

భారత్‌ లో ఇప్పటివరకు 52 కోట్ల 01 లక్షల 46 వేల 525 టెస్టులు చేశారు. కొత్తగా 31,14,696 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 63 కోట్ల 43 లక్షల 81 వేల 358 వ్యాక్సిన్లు వేశారు. ఇండియాలో యాక్టివ్ కేసులు 7,766 పెరిగాయి. ఇవి వరుసగా ఆరో రోజు పెరిగాయి. కొత్త కేసలు వరుసగా ఐదో రోజు 40వేల కంటే ఎక్కువ వచ్చాయి. 5 రోజుల తర్వాత మరణాలు 400 కంటే తక్కువ వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా కేరళలో నిన్న కొత్త కేసులు 29.84వేలు రాగా, ఆ తర్వాత మహారాష్ట్రలో 4.67వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.56వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో 131 మంది కరోనాతో చనిపోగా, ఆ తర్వాత కేరళలో 75 మంది, ఒడిశాలో 69 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలోని కొత్త కేసుల్లో కేరళవి 69.5 శాతం ఉన్నాయి.

దేశంలోని యాక్టివ్ కేసుల్లో కేరళవి 56.6 శాతం ఉన్నాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే 29 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలితాల్లో కొత్త మరణాలు 10 కంటే తక్కువే వచ్చాయి. గత వారంతో పోల్చితే, ఈ వారంలో ఇండియా కొత్త కేసులు 29 శాతం పెరగగా, ప్రపంచ దేశాల్లో 4 శాతం తగ్గాయి. ఇండియాలో టెస్టుల పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది. 35 రోజుల తర్వాత ఇది 3 శాతం కంటే పెరిగింది. 63.43 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,836 కేసులు న‌మోదు కాగా, 75 మంది ప్రాణాలు కోల్పోయారు.