Begin typing your search above and press return to search.

కరోనా: 75మంది పిల్లలను కబళిస్తోంది

By:  Tupaki Desk   |   22 April 2020 4:00 PM GMT
కరోనా: 75మంది పిల్లలను కబళిస్తోంది
X
కరోనా వైరస్ కు తరతమ బేధాలు లేకుండా అందరినీ పట్టిపీడిస్తూనే ఉంది. ఆఖరకు పసిపిల్లలను కూడా తన కబంధ హస్తాల్లో బందీ చేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తాజాగా పసిపిల్లలకు కూడా కరోనా సోకడం.. మరణిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ లో ఇప్పటికే చాలా మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో ఇద్దరు ఏడాది వయసులోపు పిల్లలు మృతిచెందారు. 14 ఏళ్లలోపు ఉన్న మరో 75మంది చిన్నారులు కరోనాతో పోరాడుతున్నారు. 16 ఏళ్లలోపు వారు ఏకంగా 70మంది వరకు ఉన్నట్లు సమాచారం.

పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. మర్కజ్ కాంటాక్ట్ లేకున్నా వీరికి కరోనా సోకడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇక పిల్లలకు కరోనా సోకితే మరో పెద్ద ఉపద్రవం ఉంటుంది. వారు ఐసోలేషన్ వార్డుల్లో ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు. ఉండలేక అమ్మా నాన్నా అంటూ మారం చేస్తున్నారు. వీరికి తోడుగా ఎవ్వరూ ఉండలేని పరిస్థితి. కరోనా భయంతో దగ్గరగా వైద్యులు కూడా ఎప్పుడూ ఉండరు. దీంతో వారి సంరక్షణ కష్టమై మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

పసిపిల్లలకు కరోనా రావడానికి కారణం వారి తల్లిదండ్రులు, వారి నుంచి పిల్లలకు కరోనా వైరస్ సోకుతోంది. నిమ్స్ లో పనిచేసే నర్సు ముద్దు ఇవ్వడం వల్ల ఒక బాలుడికి కరోనా సోకింది. పిల్లలకు తోడుగా ఎవ్వరూ ఊండకపోవడం.. వారికి కరోనా పాజిటివ్ తో ఒంటరిగా ఉంచడంతో వారి ఏడుపులకు తల్లిదండ్రుల గుండెలు కరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి పిల్లల విషయంలో ఉంది.