Begin typing your search above and press return to search.
ముంబైలో సీన్ రిపీట్.. పెరుగుతున్న కరోనా కేసులు ..!
By: Tupaki Desk | 21 Feb 2021 10:30 AM GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతంగా ఉన్న టైంలో ముంబైలో కూడా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గింది. ముంబైలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇక కరోనా తగ్గిపోయిందని ప్రజలంతా ఊపిరిపీల్చుకుంటున్న టైంలో పిడుగులాంటి వార్త ముంబైని వణికిస్తున్నది. ముంబైలో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
ముంబైలో కొత్తగా 2 వేల 749 కేసులు నమోదయ్యాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అలర్ట్ అయింది. ప్రస్తుతం నగరంలో వేయి 305 బిల్డింగ్ లను అధికారులు మూసివేశారు. ఈ సీల్ చేసిన బిల్డింగ్ లో 71 వేల 838 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం అధికారులు ముంబైలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు క్వారంటైన్లో ఉండాలని కోరుతున్నారు.
ముంబైలో సెకండ్‌వేవ్ కరోనా వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.మహారాష్ట్రలో గత 24 గంటల్లో 6 వేల 112 కొత్త కేసులు నమోదయ్యాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44 వేల 765 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 87 వేల 632కి చేరుకున్నాయి.