Begin typing your search above and press return to search.

5 కోట్లకు చేరిన కరోనా కేసులు

By:  Tupaki Desk   |   8 Nov 2020 4:15 AM GMT
5 కోట్లకు చేరిన కరోనా కేసులు
X
అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా రెండో వేవ్ మొదలైంది. దీంతో అక్కడ రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ తో విదేశాల నుంచి విమాన రాకపోకలను కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. శీతాకాలం కావడంతో కరోనా మరింత విజృంభిస్తోంది.దేశంలో 50వేలకు పైగా కేసులు ఒక్కరోజులో నమోదవుతున్నాయి.

భారత్ లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం మొదలు కావడంతో రెండో వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50357 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. ఇప్పటిదాకా భారత్ లో 78.19 లక్షల మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 5.16 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 5 కోట్ల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5.90 కోట్ల మంది కరోనా బారిన పడగా.. అందులో 12 లక్షల 54 వేల మంది మరణించారు. 3 కోట్ల 54 లక్షల మంది కోలుకున్నారు.

యూరప్, అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో రోజుకు 6 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి.

ఇక 1.01 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 85 లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది.