Begin typing your search above and press return to search.

దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో జోరు కొనసాగిస్తోన్న కరోనా !

By:  Tupaki Desk   |   26 Jun 2021 6:32 AM GMT
దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో జోరు కొనసాగిస్తోన్న కరోనా !
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు దేశంలో తగ్గుముఖం పట్టింది. జూన్ చివరి కల్లా కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా కంట్రోల్ లోకి వస్తుంది అని పలువురు నిపుణులు అంచనా వేశారు. వారు అంచనా వేసినట్టే కరోనా అయితే తగ్గుముఖం పడుతుంది కానీ దేశంలో ఇంకా రెండు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ‌కు రాలేద‌ని చెప్పాలి. ఎందుకంటే దేశంలో నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల్లో దాదాపుగా సగం పాజిటివ్ కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి.

ఇక దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో మ‌హారాష్ట్ర అత్య‌థిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేర‌ళలోకూడా ఎక్కువ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే మ‌హారాష్ట్ర‌లో మ‌ర‌ణాల రేటు కూడా ఎక్కువ‌. కేర‌ళ‌లో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువ కానీ, మ‌ర‌ణాల రేటు విష‌యంలో మాత్రం నియంత్ర‌ణ న‌మోదైంది. అయితే ఈ మద్యే మళ్లీ కేరళలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒక ద‌శ‌లో 37 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆ సంఖ్య ఆరు ల‌క్ష‌ల లోపుకు చేరింది. ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే గ‌త రెండు రోజులుగా కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప పెరుగుద‌ల న‌మోదైంది.

దేశంలోని మొత్తం ఆరు ల‌క్ష‌ల యాక్టివ్ కేసుల్లో కేర‌ళ‌లోనే ల‌క్ష కేసులు ఉన్నాయి. అలాగే మ‌హారాష్ట్ర‌లో ల‌క్షా ఇర‌వై వేల‌కు పైగా కేసులున్నాయి. క‌ర్ణాట‌క‌లో ల‌క్ష‌కు పైగా కేసులున్నా, రోజువారీ కేసులు క‌ర్ణాట‌క‌లో కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం రోజువారీ కేసుల న‌మోదులో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లు ప‌ది వేల స్థాయిలో కొన‌సాగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మిగ‌తా రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య న‌మోదు క్ర‌మంగా త‌గ్గుతున్నా, ఈ రెండు రాష్ట్రాల్లోనే త‌గ్గుద‌ల స్థాయి మెరుగ్గా లేదు. ప్ర‌త్యేకించి గ‌త వారం రోజుల నుంచి మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప పెరుగుద‌ల చోటు చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత కొంత త‌గ్గ‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం జ‌రుగుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లు ఈ అంశం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకపోతే కష్టమే.