Begin typing your search above and press return to search.

క‌రోనా నియంత్ర‌ణః వ‌ర‌స్ట్ జాబితాలో ఇండియా నంబ‌ర్ ఇదే!

By:  Tupaki Desk   |   7 May 2021 12:30 AM GMT
క‌రోనా నియంత్ర‌ణః వ‌ర‌స్ట్ జాబితాలో ఇండియా నంబ‌ర్ ఇదే!
X
క‌రోనా ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికించింది. కోట్లాది మందికి వ్యాపించింది. ల‌క్ష‌లాది మందిని బ‌లిగొంది. అయితే.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ప‌లు దేశాలు.. మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టి ప్ర‌శాంతంగా ఉండ‌గా.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన దేశాలు మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఆయా దేశాల్లో ల‌క్ష‌లాది కేసులు.. వేలాది మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌రి, అలాంటి వ‌ర‌స్ట్ దేశాల జాబితాలో ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలంటే.. ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.

తైవాన్ః క‌రోనాను అడ్డుకోవ‌డంలో ప్ర‌పంచం మొత్తానికి ఆద‌ర్శంగా నిలిచిన మొద‌టి దేశం తైవాన్. చైనాకు అతి స‌మీపంలో ఉన్న ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 1,153 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. ఇందులో కేవ‌లం 12 మంది మాత్ర‌మే ప్రాణాలు కోల్పోయారు. చైనాలో వైర‌స్ వెలుగు చూసిన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఈ దేశం.. బాధితుల‌ను వెంట వెంట‌నే క్వారంటైన్ కు త‌ర‌లించింది. త‌ద్వారా కొత్త కేసులు రాకుండా చూసుకుంది. అంతేకాదు.. వైర‌స్ తీవ్ర‌త‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు తెలిపిన‌ప్ప‌టికీ.. పెడచెవిన పెట్టింది డ‌బ్ల్యూహెచ్‌వో! ఫ‌లితంగా ప్ర‌పంచం దారుణ‌మైన మూల్యాన్ని చెల్లించుకుంటోంది.

న్యూజీలాండ్ః క‌రోనాపై వెంట‌నే యుద్ధం ప్ర‌క‌టించి, అదుపు చేసిన దేశాల్లో న్యూజీలాండ్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌రు ఆ దేశంలో 2,629 మాత్ర‌మే న‌మోద‌య్యాయి. కేవ‌లం 26 మంది మాత్ర‌మే చ‌నిపోయారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించింది. మార్చిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. ఈ విధంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికీ.. క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

ఐస్ లాండ్, సింగ‌పూర్ః క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా క‌ట్ట‌డి చేసిన దేశాల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఐస్ లాండ్ లో 6,491 కేసులు న‌మోదు కాగా.. కేవ‌లం 29 మంది మాత్ర‌మే మ‌ర‌ణించారు. అటు సింగ‌పూర్ లో కూడా 61,252 కేసులు న‌మోద‌య్యాయి. 31 మంది మాత్ర‌మే చ‌నిపోయారు. ఈ రెండు దేశాల్లోనూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేశారు. ఫ‌లితంగా.. ప్ర‌పంచం మొత్తం అల్ల‌కల్లోల‌మైనా.. ఈ దేశాల్లో జ‌న‌జీవ‌నం ప్ర‌శాంతంగా త‌మ ప‌ని తాము చేసుకుంటోంది.

ఇక‌, కొవిడ్ ను అడ్డుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌, మెక్సికో, బ్రిట‌న్ దేశాలు ప్ర‌ముఖంగా ఉన్నాయి. ట్రంప్ తెంప‌రిత‌నంతో వైర‌స్ ను లైట్ తీసుకున్నారు. దీంతో.. ఆ దేశం అల్ల‌క‌ల్లోల‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 3.25 కోట్ల మంది వైర‌స్ బారిన ప‌డ‌గా.. 5.78 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త అధ్య‌క్షుడు బైడెన్ వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌గిన చ‌ర్య‌లు తీసుకొని, వ్యాక్సిన్ వేగంగా అందించ‌డంతో కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. బ్రెజిల్ కూడా దారుణంగా అత‌లాకుత‌ల‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన ప‌డి 4 ల‌క్ష‌ల మందికిపైగా చ‌నిపోయారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. జ‌నం కూడా లైట్ తీసుకున్నారు. దానికి మూల్యం దారుణంగా చెల్లించుకున్నారు.

క‌రోనాను అడ్డుకోలేక‌పోయిన దేశాల్లో భార‌త్ కూడా ఉంది. తొలిద‌శ‌లో లాక్ డౌన్ విధించి కొంత స‌ఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. సెకండ్ వేవ్ ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌పై దృష్టిసారిస్తే.. జ‌నం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా దేశంలో మార‌ణ‌హోమం కొన‌సాగుతోంది. రోజుకు 4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. వేలాది మంది చ‌నిపోతున్నారు. ఈ ప‌రిస్థితి ఎన్నాళ్లు కొన‌సాగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మెక్సికో, బ్రిట‌న్ దేశాల్లోనూ ఇదే ప‌రిస్థితి. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం, ప్ర‌జ‌ల స‌హ‌కారం లోపించ‌డం వంటి కార‌ణాల‌తో ల‌క్ష‌లాదిగా కేసులు న‌మోద‌య్యాయి. మ‌రి, ఈ అనుభ‌వాలతో ఆయా దేశాలు ఎలాంటి గుణ‌పాఠాలు నేర్చుకుంటాయో చూడాలి.