Begin typing your search above and press return to search.
కరోనాకు మందు వచ్చేసింది... కనుగొన్నది మనోళ్లే
By: Tupaki Desk | 13 March 2020 3:36 PM GMTప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటిదాకా వేలాది మందినే బలి తీసుకుంది. చాలా స్వల్ప వ్యవధిలోనే దాదాపుగా అన్ని దేశాలను చుట్టేసిన ఈ వైరస్ కు విరుగుడు మాత్రం ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు. లక్షల మంది కి నిమిషాల వ్యవధిలో సోకుతున్న ఈ వైరస్... వేల మందిని పొట్టనపెట్టేసుకుంటోంది. ఇంతటి ప్రమాదకర వైరస్ ను నిరోధించే దిశగా ప్రపంచంలోని అగ్ర దేశాల తో పాటు చాలా దేశాలు ఇప్పటికే ప్రయోగాలను మొదలుపెట్టినా... ఏ ఒక్క దేశం కూడా కరోనాకు మందును కనిపెట్టలేకపోయింది. అయితే మన దేశం మాత్రం ఈ వైరస్ కు మందును కనిపెట్టేసింది. ప్రపంచ దేశాలన్నింటికీ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వార్త వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
మన దేశంలోని రాజస్థాన్ కు చెందిన నగరం జైపూర్ లోని ఓ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం కరోనాకు మందును కనిపెట్టిందట. ఈ వార్త ఇప్పుడు జాతీయ మీడియా లో వైరల్ గా మారిపోయింది. అయినా వైద్య రంగంలో మంచి పురోగతిని నమోదు చేసిన దేశాలే ఈ విషయంలో చేతకాకుంటే... జైపూర్ వైద్యులు కరోనాకు విరుగుడు ఎలా కనిపెట్టారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే కరోనా సోకిన వ్యాదిగ్రస్తులకు చికిత్సలు అందించే క్రమంలోనే జైపూర్ వైద్యులు కరోనా మందును కనిపెట్టారట. అంటే.. ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందజేస్తున్న సమయంలో వారికి ఇస్తున్న మందులు, వాటి పరిశీలన.. వెరసి కరోనాకు మందును కనిపెట్టేశారన్న మాట.
ఇటీవలే జైపూర్ వచ్చిన 16 మంది ఇటలీ టూరిస్టులు కరోనా బారిన పడిన వైనం మనకు తెలిసిందే. వారందరిని వారం క్రితం జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చడం కూడా మనం విన్నాం కదా. వారికి చికిత్సలు అందించేందుకు ఓ వైద్య బృందం రంగంలోకి దిగగా... రోగులందరికీ వైద్య బృందం చికిత్స అందించిన క్రమంలోనే కరోనాకు మందు కనిపెట్టడం జరిగిందట. ప్రస్తుతం కరోనా చికిత్సకు ప్రత్యేక మందులేవీ లేకున్నా... అందుబాటులో ఉన్న మందులనే వినియోగిస్తున్న విషయం తెలిసిందే కదా. ఇలా ఓ నాలుగు రకాల మందులను ఓ రోగికి ఇవ్వగా... సదరు రోగి కరోనా నుంచి పూర్తిా కోలుకున్నారట. ఈ విషయం గమనించిన వైద్య బృందం విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించిందట. ఉన్నతాధికారుల సూచనల మేరకు నాలుగు మందుల మిశ్రమంగా ఉన్నకొత్త మందును మరిన్ని ప్రయోగాలు చేసి ధృవీకరించాలని వైద్య బృందానికి ఆదేశాలు అందాయట. చూస్తుంటే.. ఈ మందే ఇప్పుడు కరోనాకు విరుగుడుగా మారే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.