Begin typing your search above and press return to search.
మూలికలతో కరోనా నివారణ.. మార్కెట్ లో ఆయుష్ శాఖ ఉత్పత్తులు
By: Tupaki Desk | 28 April 2020 12:50 PM GMTకరోనా వైరస్ నివారణకు ఉన్న మార్గాలను వివిధ వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనదేశ పురాతన వైద్యశాస్త్రం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదంలో ఉన్న వైద్య సలహాలను కరోనా నివారణకు కేంద్ర ఆయుశ్ శాఖ వెల్లడిస్తోంది. తాజాగా కరోనా నివారణకు మూలికల ఔషధాలను ఆ శాఖ సూచించింది. వైరస్‌ను ఎదుర్కొనేలా రోగ నిరోధక శక్తిని పెంచే మూలికా ఔషధ ఫార్ములాతో కేంద్ర ఆయుష్ శాఖ ముందుకొచ్చింది.
ఈ క్రమంలో టీ పొడులు, మాత్రల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలకు కేంద్ర ఆయుష్ ఓ లేఖ రాసింది. వాటిని ‘ఆయుష్ క్వాత్’, ‘ఆయుష్ కుదినీర్’, ఆయుష్ జోషంద’ అనే జనరిక్ పేర్లతో విక్రయించాలని సూచించింది. అయితే వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. మూలికా ఔషధంలో తులసి ఆకుల పొడి, దాల్చిని చెక్క పొడి, శొంటి పొడి, మిరియాల పొడి ఉంటాయి. ఈ పొడులన్నీ కలిపిన 3 గ్రాముల మిశ్రమాన్ని 150 మిల్లీలీటర్ల మరిగించిన నీళ్లలో వేసి కషాయం (డికాక్షన్)గా చేసుకొని రోజూ ఒకటి లేదా రెండుసార్లు తాగాలి. కరోనా వైరస్ రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే రాదు. దీంతో ఆ రోగ నిరోధక శక్తి పెంచుకునేలా ఆ కషాయం తాగాలని ఆయుష్ శాఖ సూచించింది. రోగ నిరోధక వ్యవస్థను సమాయత్తం చేసుకునేందుకు వృద్ధులు తీసుకోవాల్సిన పలు మూలికా ఔషధాలను దాదీ దాదా ఫౌండేషన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ వసంత్ మాలతీ, చయన్‌ప్రష్ వాడకంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించింది.
ఈ సూచనలను పరిశీలిస్తే మొత్తానికి రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనా వైరస్ రాదని స్పష్టమవుతోంది. ఏ మార్గాల ద్వారానైనా ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. మన రోగ నిరోధక శక్తే మనకు శ్రీరామరక్ష అని గుర్తించి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.