Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం... నయమయ్యాక మళ్లీ తిరగబెడుతోందట

By:  Tupaki Desk   |   26 March 2020 8:30 PM GMT
కరోనా కల్లోలం... నయమయ్యాక మళ్లీ తిరగబెడుతోందట
X
కోవిడ్- 19 వైరస్ బారిన పడి వైద్య చికిత్సల తర్వాత ఆ వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నాక... ఇక భయం ఏమీ లేదన్న భావన ఇప్పటిదాకా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... కరోనా బారిన పడిన వారు ఆ వైరస్ నుంచి కోలుకున్నాక... వారికి మళ్లీ తిరగబెడుతోందన్న షాకింగ్ వార్తలు కలకలం రేపుతున్నాయి. సాధారణంగా ఫ్లూ తరహా వైరస్ లు సోకిన తర్వాత చికిత్స తీసుకుని దాని బారి నుంచి పడిన వారిలో రోగ నిరోధక శక్తి ఓ రేంజిలో ఉంటుందని, తిరిగి వారిలో ఫ్లూ వైరస్ కనిపించడం దాదాపుగా సాధ్యం కాదని, ఏవో అతి కొన్ని కేసుల్లోనే తిరిగి ఆ వైరస్ తిరగబెట్టినా... అందుకు చాలా సమయమే పడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రాణాంతక వైరస్ గా మారిన కోవిడ్- 19 విషయంలో ఈ తరహా తిరగబెట్టడం చాలా త్వరగానే జరుగుతోందన్న విషయం నిజంగానే ఆందోళన రేకెత్తించే విషయమే.

ఈ తరహాలో కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోగులకు వెను వెంటనే మళ్లీ కరోనా పాజిటివ్ వస్తోందట. ఈ తరహా కేసుల సంఖ్య కూడా అంత తక్కువగా ఏమీ లేవట. ఈ తరహా కేసులు ఏకంగా 14 శాతం మేర ఉంటున్నాయన్న విషయం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలా పాజిటివ్ నుంచి నెగెటివ్ కు చేరి మళ్లీ పాజిటివ్ గా తేలిన కేసులు జపాన్ లో నమోదయ్యాయి. జపాన్ లో ఓ 70 ఏళ్ల వృద్ధుడికి గత నెల కరోనా పాజిటివ్ అని తేలడం తో టోక్యో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నెగెటివ్ అని తేలాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారట. ఆ తర్వాత సదరు వృద్ధుడు చాలా ఫ్రీగానే సంచరించాడట. అయితే ఆయనకు తిరిగి జలుబు, జ్వరం రావడం తో తిరిగి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చిందట.

ఈ వృద్ధుడే కాకుండా జపాన్ లో ఇలా కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్ గా మారి... తిరిగి కరోనా పాజిటివ్ గా మారిన వారు చాలా మందే ఉన్నారని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో ఓ 14 శాతం మందికి ఇలా కరోనా తిరగబెడుతోందట. అయితే వీరికి కరోనా కొత్తగా రెండోసారి కరోనా సోకిందని చెప్పడానికి కూడా ఆధారాలేమీ లేవని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నాయి. అంటే.. కరోనాకు పాజిటివ్ గా తేలి... నెగెటివ్ గా మారిన వారిలో నుంచి కరోనా వైరస్ పూర్తి స్థాయిలో బయటకు వెళ్లిపోవడం లేదట. అంటే... కరోనా వైరస్ ఒక్కఃసారి సోకితే.. మనిషి శరీరం నుంచి ఆ వైరస్ ను పూర్తిగా పారదోలడం అంత ఈజీ కాదన్న వాదనలు ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సో... కరోనా ఒక్కసారి సోకితే... చికిత్స తర్వాత నెగెటివ్ అని వచ్చినా.. రోగులు చాలా జాగ్రత్తగానే ఉండక తప్పదన్న మాట.