Begin typing your search above and press return to search.
కరోనా మరణ మృదంగం..వేదనతో యువ వైద్యుడి ఆత్మహత్య
By: Tupaki Desk | 2 May 2021 4:30 PM GMTదేశ రాజధాని ఢిల్లీ కరోనా కల్లోలంతో వణికిపోతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది బాధితులతో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోయాయి. మరోవైపు ఆక్సిజన్ కొరత ఆస్పత్రులను తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ సరిపోక రోజూ వందలాది మంది బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే చేయి దాటి పోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి తెలియజేసి ఆక్సిజన్ సిలిండర్లను సాయం చేయాలని పదేపదే విన్నవిస్తున్నారు. అయినా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత అధికంగా ఉండటంతో కేంద్రం ఢిల్లీ కి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయలేక పోతోంది. దీంతో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ సరిపోక పిట్టల్లా రాలిపోతున్నారు. కాగా ఢిల్లీలో మరణ మృదంగం పై చలించిన ఓ యువ డాక్టర్ బాధితుల మరణాలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ కు చెందిన డాక్టర్ వివేక్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. రోజుకు ఏడెనిమిది మంది పేషెంట్లకు ఆయన చికిత్స అందించేవారు. ఎన్ని చికిత్సలు చేసినా తన కళ్ళముందే బాధితులు మృత్యువాత పడుతుండడంతో వివేక్ మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ వేదన భరించలేక వివేక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివేక్ కు భార్య ఉంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. దీంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.
కాగా వివేక్ ఆత్మహత్యపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ డాక్టర్ రవి వాంఖేడ్కర్ మాట్లాడుతూ వ్యవస్థ వైఫల్యం కారణంగానే వివేక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. రోజూ పదుల సంఖ్యలో మృతి చెందుతున్న కరోనా బాధితులను చూసి వివేక్ మానసిక వేదనకు గురయ్యే వారని, ఈ బాధను భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. దేశంలోనే ఆస్పత్రుల్లో ఆరోగ్య సౌకర్యాల కొరత కారణంగా యువ వైద్యులు డిప్రెషన్ కు గురవుతున్నారన్నారు.
ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమితో పాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యకు తగ్గట్టుగా డాక్టర్ ల సంఖ్య కూడా లేదని, దీంతో బాధితులకు చికిత్స అందజేయడం కష్టతరంగా మారింది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వైద్యులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు. కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్స అందజేసే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది.