Begin typing your search above and press return to search.
అమెరికాలో కరోనా మరణ మృదంగం...
By: Tupaki Desk | 14 Aug 2021 2:47 AM GMTకరోనా మహమ్మారి మరోమారు అమెరికాపై పంజా విసిరింది. అమెరికాలో కరోనా రూపు మార్చుకొని డెల్టా వేరియంట్ తో విలయ తాండం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదుకావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ...కరోనా కేసులు పెరగడం అధ్యక్షుడు బైడెన్ ను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదముందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) హెచ్చరించింది.
అమెరికాలో డెల్టా వేరియంట్ విరుచుకుపడుతోందని, దీంతో, రాబోయే 4 వారాలు అత్యంత కీలకమని వెల్లడించింద. మరోవైపు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రోజుకు పదివేలకు చేరుకుంది. ప్రస్తుతం రోజుకు సగటున 9700 మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారని, గత వారం రోజులుగా సగటున రోజుకు 1,13,000 కేసులు నమోదవుతున్నాయని సీడీసీ వెల్లడించింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33,000కు పైగా కొవిడ్ రోగులు ఆస్ప్రతుల పాలవుతారని సీడీసీ అంచనా వేస్తోంది.
అంతేకాదు, సెప్టెంబరు 4 నాటికి అమెరికాలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య 3,300-12,600 ఉండొచ్చని సీడీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగిపోయాయని, రోగులకు వైద్య సేవలు అందించడం వైద్యులకు తలకుమించిన భారంగా మారిందని వెల్లడించింది. గత నెల రోజుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య 600 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించింది. ఇక, ఐసీయూలో అడ్మిట్ అవుతున్నవారి సంఖ్య 570 శాతానికి పెరిగిందని, బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడిందని చెప్పింది.