Begin typing your search above and press return to search.
బీహార్ లో ‘కరోనా’ మరణ మృదంగం.. ఇన్ని మరణాలా?
By: Tupaki Desk | 11 Jun 2021 2:30 PM GMTబీహార్ లో కరోనా మరణ మృదంగం వినిపిస్తోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వం కరోనా విలయాన్ని తక్కువ చేసి చూపించిందన్న విమర్శలు తెచ్చుకుంది. తాజాగా ఆ తప్పులను ఒప్పుకుంది. ఫలితంగా నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే ఏకంగా బీహార్ లో 3971మంది చనిపోవడం సంచలనమైంది. గతంలో చనిపోయిన వారి సంఖ్యను తక్కువగా చూపి.. ఇప్పుడు లెక్కలు సవరించడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది.
జూన్ 8న తమ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5458గా బీహార్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రోజు వారి సంఖ్య 9429గా సవరించింది. ఒక్కరోజులోనే బీహార్ లో ఏకంగా 72శాతం మందిని కొత్తగా మరణాల లిస్ట్ లో చేర్చడం సంచలనమైంది.
ఇటీవల బీహార్ ప్రభుత్వం కరోనాతో మరణించిన కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బక్సర్ జిల్లాలో కొంతమంది తమకు పరిహారం అందడం లేదని.. కరోనా మరణాలను కూడా సహజ మరణాలుగా లెక్కతీశారంటూ కోర్టుకెక్కారు. బక్సర్ జిల్లా లెక్కల్లో తప్పులు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాట్నా కోర్టు రాష్ట్రమంతా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. అధికార యంత్రాంగం నష్టనివారణ చర్యలు చేపట్టింది.
హోం ఐసోలేషన్ లో ఉండి చనిపోయిన వారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు, కరోనా నుంచి కోలుకున్నాక ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినవారు.. ఇలా అందరి లిస్ట్ ను అప్ డేట్ చేసింది. దీంతో మరణాల సంఖ్య 72శాతం పెరిగింది.
బీహార్ లోనే కాదు.. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు కేసుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయనే అపవాదును తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో చనిపోయిన బాధిత కుటుంబాలు బయటకు వచ్చి కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది.