Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా మృత్యుఘోష ..గుట్టలు గుట్టలుగా మృతదేహాలు !
By: Tupaki Desk | 24 April 2021 11:30 PM GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కేసులతోపాటు నిత్యం వేలాది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఏపీలో కూడా కరోనా జోరు కొనసాగుతుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల నుంచి సరైన సమాచారాన్ని స్వీకరించలేకవడంతో వివరాలు తెలియక మృతదేహాలు మార్చిరీలోనే ఉండిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో కరోనా కరాళ నృత్యంతో రోజుకు 30 నుంచి 40 మంది మృత్యువాత పడుతున్నారు. దీనితో, మృతదేహాలతో మార్చురీలు నిండిపోతున్నాయి.
కరోనా వైరస్ తో మృతి చెందినవారి బంధువులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చిరీలోకి తరలిస్తున్నారు. అయితే రోగి వివరాలు చెప్పకుండా దాయడంతో కూడా ఈ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాలను అప్పగించడంతో ఆలస్యం అవడంతో మృతుల కుటుంబ సభ్యులు గొడవకు దిగుతున్నారు. గతంలో విజయవాడ వన్ టౌన్ కు చెందిన ఓ వృద్దురాలు తన భర్తకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్చింది. ఐదు రోజులు గడిచిన తర్వాత భర్త బాగోగులు తెలుసుకునేందుకు హాస్పిటల్ కు వెళ్తే, తాము అడ్మిట్ చేసుకోలేదని బుకాయించారు. ఆ తర్వాత మీడియా సహాయంతో ఆసుపత్రిలో జాయిన్ చేసిన సీసీఫుటేజ్ ను పరిశీలిస్తే, అసలు విషయం తెలిసింది. వృద్దుడిని ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు కన్ఫామ్ అయింది. చివరికి ఆ శవం మృతదేహం మార్చిరీలో ఉంది. ఇలా చాలా ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో కడసారి చూపుకూడా దక్కని స్థితిలో మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఓ పక్క కరోనా వైరస్ తో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే పరిశుభ్రంగా ఉండాల్సిన హాస్పిటల్స్ అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీనితో రోగం తగ్గడం ఏమో గానీ మరింత ముదిరేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనాతో ప్రాణాలు విడిచిన వారి మృతదేహాలతో స్మశాన వాటికలు నిండిపోతున్నాయి. అంత్యక్రియల కోసం స్మశానాల దగ్గర రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా, రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పదివేలు దాటిపోయాయి. నిన్న ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కరోనా వివరాల ప్రకారం .. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 9,97,462 గా నమోదయ్యాయి. మొత్తం కరోనా మృతులు 7, 541 గా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు సిద్ధం చేయాలని ఆదేశించామని వెల్లడించారు.