Begin typing your search above and press return to search.

క‌రోనా డెలివ‌రీః ఇంటికే మందులు, ఆహారం!

By:  Tupaki Desk   |   18 April 2021 12:30 PM GMT
క‌రోనా డెలివ‌రీః ఇంటికే మందులు, ఆహారం!
X
ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తీరుకు ప్ర‌పంచం యావ‌త్తూ చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రికైనా పాజిటివ్ వ‌చ్చిందంటే.. వాళ్ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే. ఆసుప‌త్రికి వెళ్లాలంటే ల‌క్ష‌లు చేతిలో ప‌ట్టుకురావాల్సి వ‌స్తోంది. అయినా.. బెడ్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో ఇంట్లోనే ఉండాలంటే.. కుటుంబ స‌భ్యుల‌కు సోకుతుందేమోన‌నే భ‌యం. దీంతో.. వారికి భోజ‌నం, మందులు ఇత‌ర‌త్రా అవ‌స‌రాలు తీర్చ‌డం స‌వాల్ గా మారుతోంది. ఇందుకోసం తామున్నామంటూ కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావ‌డం అభినంద‌నీయం.

పాజిటివ్ వ‌చ్చి ఇంట్లోనే ఉంటున్న‌వారికి 14 రోజుల పాటు వివిధ ప్యాకేజీల్లో త‌క్కువ ధ‌ర‌కే ఆహారం, ఇత‌ర‌త్రా సేవ‌లు చేస్తున్నాయి ప‌లు సంస్థ‌లు. అయితే.. ప‌లు ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఎక్కువ‌గా ఛార్జ్ చేసే సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల రెగ్యుల‌ర్ గా తెప్పించుకోవ‌డం అంటే చాలా ఖ‌ర్చుతో కూడిన ప‌ని. పైగా ఒక స‌మ‌యం అంటూ ఉండ‌దు. అంతేకాకుండా.. మందులు, ఇత‌ర‌త్రా వ‌స్తువుల‌ను వారు స‌ర‌ఫ‌రా చేయ‌రు. అందుకే.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఈ బాధ్య‌త తీసుకున్నాయి.

శాఖాహార భోజ‌నంలో రెండు కాయ‌గూలతోపాటు ప‌ప్పు, పులిహోర అన్నం, అప్ప‌డం, పెరుగు, స్వీటు అందిస్తున్నాయి. ఉద‌యం, రాత్రి వేర్వేరు కూర‌లు స‌ర‌ఫ‌రా చేస్తారు. ఒక పూట భోజ‌నానికి రూ.110 ఛార్జ్ చేస్తున్నాయి. మాంసాహారం కావాలంటే.. చికెన్‌, ప‌ప్పు, సాంబారు, పెరుగు ఇస్తారు. దీనికి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. మ‌ట‌న్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి 180 రూపాయ‌లు చెల్లించాలి.

ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీ, బంజారాహిల్స్‌; గ‌చ్చిబౌలి, అమీర్ పేట‌, మాదాపూర్‌, మ‌ణికొండ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. నిజానికి.. క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసిన వ్య‌క్తి ఉన్న ఇంటివైపు వెళ్ల‌డానికే జ‌నం జంకుతారు. ఇక‌, అవ‌కాశం చూసి డ‌బ్బులు పోగేసుకునే ఆసుప‌త్రుల‌కు కొద‌వ‌లేదు. కానీ.. ఇలాంటి స‌మ‌యంలోనూ హోమ్ డెలివరీ చేస్తూ వీరు తీసుకుంటున్న మొత్తం త‌క్కువేన‌ని అంటున్నారు.