Begin typing your search above and press return to search.

కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైంది : డోనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   18 Jun 2021 11:02 AM GMT
కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైంది : డోనాల్డ్ ట్రంప్
X
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కి కారణం డ్రాగన్ కంట్రీ చైనానే అంటూ మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కరోనా వల్ల భారత్ సర్వనాశనమైందని అన్నారు. పాక్స్‌ న్యూస్‌ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యత వహిస్తున్న చైనా అమెరికాకు రూ.742,32,600 కోట్లు చెల్లించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. మాములుగా అయితే చైనా ప్రపంచానికి చాలా ఎక్కువే చెల్లించాలని, అయితే దాని సామర్థ్యం ఇంతేనని అన్నారు.చైనా చేసిన చర్యల వల్ల చాలా దేశాలు నాశనమయ్యాయని ఆరోపణలు చేశారు. ప్రజారోగ్యం విషయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ ను ఉదాహరణగా చూపించారు ట్రంప్. కరోనా మహమ్మారి చైనాలో పుట్టిందని, చైనాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని గతంలో డిమాండ్‌ చేసిన ట్రంప్‌.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు.

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిందని , ప్రపంచ వ్యాప్తంగా నాలుగు మిలియన్లకుపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే చైనా ప్రయోగశాల నుంచి వైరస్‌ బయటపడిందని ట్రంప్‌ పలు సందర్భాలలో ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నష్టపోయిన దేశాలలో ఒకటిగా భారత్ అని, ఏప్రిల్‌- మే నెలల్లో కోవిడ్‌ భారత్‌ ను తీవ్ర స్థాయిలో కుదిపేసిందన్నారు. కాగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో పర్యటించి కరోనాపై వాస్తవాలను బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. చైనా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ఆరోపణలు గుప్పించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా చైనాలోని వూహాన్‌లో పర్యటించి కరోనా పుట్టుకపై ఆరా తీశారు. ఇక సెకండ్‌ వేవ్‌ లో భారత్‌ను మరింత కుంగదీసిన కరోనా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ఫస్ట్‌ వేవ్‌ లో కంటే సెకండ్‌ వేవ్‌ భారత్‌ తీవ్ర స్థాయిలో వ్యాపించింది.