Begin typing your search above and press return to search.
తమిళనాడు లో కరోనా దేవి ఆలయం .. !
By: Tupaki Desk | 20 May 2021 7:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. మన దేశంలో దాదాపుగా అంతరించిపోయిందని భావించిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో విలయం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తగ్గాలని చెట్లకు వివాహం చేయటం, గ్రామ దేవతలను పూజించడం వంటి వార్తలు ఎన్నో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా కరోనా దేవిని ప్రతిష్టించి 48రోజులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని తమిళనాడులోని కోయంబత్తూరు కామచ్చిపురి అధినం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కరోనా దేవి అనే దేవతను ప్రతిష్టించి యాగం నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే, ఆ సమయంలో ప్రజలు ప్రార్థనలు చేయడానికి, ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఉండదని తెలిపారు. ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి దేవతలను ప్రతిష్టించడం గతంలో ఆచరణలో ఉందని తెలిపారు.
దీనికి కోయంబత్తూరులో ప్లేగు మరియమ్మన్ ఆలయం ఓ ఉదాహరణ. గతంలో ప్లేగు, కలరా వ్యాపించినపుడు ఈ దేవతలు ప్రజలను రక్షించారని అక్కడి వారి నమ్మకమని కామచ్చిపురి అధినం మేనేజర్ ఆనంద్ భారతి అన్నారు. ఇప్పుడు కూడా అదే రకంగా కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజాలు చేయాలని నిర్ణయించారు. కాగా తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి గతవారం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం.. కిరాణా, కూరగాయలు, మాంసం, చేసలు విక్రయించే దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటలకు వరకు మాత్రమే తెరివడానికి అనుమతిస్తున్నారు.