Begin typing your search above and press return to search.

కరోనా మందు: ఖరీదు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Jun 2020 2:30 PM GMT
కరోనా మందు: ఖరీదు ఎంతో తెలుసా?
X
కరోనా వైరస్ సోకిన బాధితులపై అద్భుతంగా పనిచేస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ఔషధం ‘రెమెడిసివిర్’ ఈ నెలాఖరు నాటికి మన దేశంలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అమెరికాలో దీన్ని తయారు చేసిన పరిశోధన సంస్థ గిలీడ్ తాజాగా భారత్ లోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా కంపెనీలతోపాటు డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలకు తన ఫార్ములాను ఇచ్చి గిలీడ్ 127 దేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

గిలీడ్ ఫార్మా ‘రెమెడిసివీర్’ ఔషధానికి సంబంధించిన ఫార్ములాను ఆయా కంపెనీలకు బదిలీ చేస్తుంది. ఈ కంపెనీలు ఇప్పటికే దేశంలో ఉత్పత్తి చేసి పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేశాయి. అనుమతులు వస్తే వీటిని తయారు చేస్తాయి.

కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు మాత్రమే వీటిని వాడుతారు. తీవ్రతను బట్టి రెండు డోసులు, తరువాత ఒక్కో డోసు ఇస్తారు. ఐదు డోసులకు రూ.40వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడం.. ఈ మందు పనిచేస్తుండడంతో ఖరీదు కూడా భారీగానే ఉంటుదని అంటున్నారు.