Begin typing your search above and press return to search.

కరోనా వచ్చిందా? జాగ్రత్త..! మీ బ్రెయిన్​ కూడా పనిచేయకపోవచ్చు..!

By:  Tupaki Desk   |   26 April 2021 2:30 AM GMT
కరోనా వచ్చిందా? జాగ్రత్త..!  మీ బ్రెయిన్​ కూడా పనిచేయకపోవచ్చు..!
X
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రస్తుతం మనదేశంలో విచ్చలవిడిగా కేసులు నమోదవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారమే రోజుకు 3 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. ఇక అనధికారికంగా చాలా కేసులు బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయని.. తద్వారా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డాక్టర్లు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేమిటంటే..

కరోనాతో ఊపిరితిత్తులు మాత్రమే కాదు.. మెదడు కూడా దెబ్బతింటున్నదట. కరోనా వచ్చిన వాళ్లు వాసన గుర్తించే శక్తిని కోల్పోతారని గతంలో నిపుణులు బయటపెట్టారు. అయితే వాసన గుర్తించడం అనేది మెదడు చేసే పని.. అంటే కరోనా వైరస్​ మెదడుపై కూడా తన ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంచనా వేశారు. ఆ దిశగానే ప్రయోగాలు చేయగా.. కరోనా మెదడు పనితీరును దెబ్బతీస్తుందని తేలింది.

కొంతమంది కరోనా రోగులకు కాళ్లు చేతులు పడిపోయాయి. మూతి వంకర్లు తిరిగింది. అయితే కరోనా మెదడు మీద ప్రభావం చూపడం వల్ల ఇటువంటి లక్షణాలు బయటపడుతున్నాయని అప్పట్లో కొందరు వైద్యులు అనుమానించారు.

ఆ దిశగా కొన్ని ప్రయోగాలు, అధ్యయనాలు చేయగా.. కరోనా మెదడు మీద కూడా ప్రభాం చూపుతుందని తేలింది.

సీటీ స్కాన్, ఎంఆర్​ఐ స్కాన్​ వంటి పరీక్షలు చేసినప్పుడు కరోనా వైరస్​ మెదడు పై ప్రభావం చూపుతుందని తేలింది.

అయితే ముఖ్యంగా డయాబెటిస్, హైబీపీ, ఊబకాయం ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు తేల్చారు. సెంట్రల్‌ నర్వస్‌ సిస్టమ్‌ (మెదడు, వెన్నుపాము, రెటీనా) ,పెరిఫెరల్‌ నర్వస్‌ సిస్టమ్‌ (నరాలు, గాంగ్లియా, కండరాలు) దెబ్బతింటున్నాయని తేలింది.

ఇందుకు సంబంధించి ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో పరిశోధనలు సాగాక మెదడుపై కరోనా వైరస్​ ఎంత మేర ప్రభావం చూపుతుందో తెలియనున్నది.అంతేకాక మెదడు పై కరోనా వైరస్​ ప్రభావం చాలా ఆలస్యంగా వెలుగు చూస్తుండటం గమనార్హం. కరోనా నెగిటివ్​ వచ్చి .. వ్యాధి లక్షణాలు అన్ని తగ్గిపోయాక రోగిని సాధారణంగా డిశ్చార్జి చేస్తుంటారు. అయితే ఓ రెండు లేదా మూడు నెలలు గడిచాక రోగికి మెదడు సంబంధిత సమస్యలు బయటపడుతున్నాయట. ఒకవేళ ముందుగానే అంటే కరోనా చికిత్స టైంలోనే ఈ సమస్యను గుర్తిస్తే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు.