Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్‌ : ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ లకి సిద్దమైన గూగుల్..!

By:  Tupaki Desk   |   10 March 2020 3:30 PM GMT
కరోనా ఎఫెక్ట్‌ : ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ లకి సిద్దమైన గూగుల్..!
X
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ఐటి రంగం పై ప్రభావం చూపిస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇక ఈ కరోనా దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగుల కి వర్క్ ఫ్రం హోంను ఆఫర్ చేసాయి. దీనితో ప్రస్తుతం చాలా కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాప్ సెర్చ్ ఇంజన్ సంస్థ అయిన గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులకు తమ క్యాంపస్‌ లలో ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా ఆన్‌ లైన్‌ లో వర్చువల్‌ గా ఇంటర్వ్యూలు చేయాలనీ నిర్ణయం తీసుకోని ,ఆ మేరకు గూగుల్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. అమెరికాలో ని సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ లలో ఉన్న గూగుల్‌ కార్యాలయాల కు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు ఇకపై ఆ క్యాంపస్‌ లకు వెళ్లాల్సిన పనిలేదని, తామే వారికి ఆన్‌ లైన్‌ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని గూగుల్‌ తెలిపింది. అలాగే ఆ క్యాంపస్‌ లను చూసేందుకు వచ్చే సందర్శకులను కూడా ఇకపై క్యాంపస్‌ లలోకి అనుమతి ఉండదు అని గూగుల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు