Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: 50శాతం మందికి వర్క్ ఫ్రం హోం
By: Tupaki Desk | 4 Jan 2022 7:30 AM GMTదేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో కేంద్రం కూడా అలెర్ట్ అయ్యింది. ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ రంగంలో ఇస్తున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తోంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అండర్ సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50శఆతం మందికి వర్క్ ఫ్రం హోంకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని సోమవారం కేంద్రం తెలిపింది.
వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50శాతం మంది మాత్రమే విధులకు హాజరు కావాలని.. మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది.
కంటెయిన్ మెంట్ జోన్లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీనోటిఫై చేసే వరకూ ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులంతా ఒకే సమయంలో కార్యాలయాలకు రాకుండా వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అంతా హాజరుపట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుదని తెలిపింది.