Begin typing your search above and press return to search.
కరోనా కల్లోలం: బ్రెజిల్ ను దాటేసిన భారత్
By: Tupaki Desk | 6 Sep 2020 4:15 AM GMTకరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. 9 నెలల వ్యవధిలో ఒకే రోజు అత్యధిక కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కోవిడ్ 19 కేసుల్లో బ్రెజిల్ దేశాన్ని వెనక్కినెట్టిన ప్రపంచంలోనే రెండో స్థానానికి భారత్ చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లోనే ఏకంగా కొత్తగా 89690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.13 లక్షలకు పెరిగింది. ఒకరోజులో నమోదైన కొత్త కేసులకు సంబంధించి ఇది సరికొత్త రికార్డు.
గడిచిన 9 నెలల్లో దేశంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధిక కావడం గమనార్హం. ఒకే రోజు 90వేలకు పైగా కేసులు నమోదు కావడం భారత్ లో ఇదే తొలిసారి.
ఆదివారం నాటికి మొత్తం కేసుల్లో భారత్ బ్రెజిల్ ను వెనక్కి నెట్టి అమెరికా తర్వాత స్థానంలో నిలిచింది. భారత్ లో కేసుల సంఖ్య 41.13 లక్షలకు చేరింది. అమెరికాలో 64.30 లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. టెస్టుల సంఖ్యను పెంచడమే భారత్ లో కరోనా కేసులు బయటపడడానికి కారణంగా తెలుస్తోంది.