Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో కరోనా కలకలం!

By:  Tupaki Desk   |   13 Sep 2020 1:00 PM GMT
పార్లమెంట్ లో కరోనా కలకలం!
X
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు రెడీ అయ్యింది. కరోనా నియంత్రణ చర్యలను చేపడుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు 72 గంటల ముందు హాజరయ్య ఎంపీలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. నెగెటివ్ గా తేలితే.. వారికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ పత్రం ఉన్న వారినే సభలోకి అనుమతిస్తామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.

సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలకు కరోనా పరీక్షలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1కి ఈ సమావేశాలు ముగుస్తాయి. శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ టెస్టుల్లోనూ కొంతమంది ఎంపీలకు పాజిటివ్ అని తేలినట్లు సమాచారం.

దీంతో సమావేశాలకు హాజరైన ఎంపీల్లో కలవరం మొదలైంది. ఇప్పటివరకు 24 మంది ఎంపీలకు.. 8మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది. సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్ సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, సెక్రెటేరియట్ సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు.